బ్రాహ్మణులపై సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేనాని

ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ ఏజెన్సీ ప్రాంత పర్యటన పూర్తి చేసుకున్నాడు.తాజాగా.

రాజమండ్రిలో బ్రాహ్మణులతో సమావేశం అయిన ఆయన వారి గురించి చాలా ఆవేశంగా మాట్లాడారు.బ్రాహ్మణుల భాష‌, యాస‌ల‌ను కించ‌ప‌ర‌స్తే క‌ఠిన చర్యలు తీసుకుంటామన్న పవన్‌.

బ్రాహ్మణులంటే వెటకారం, వారిని అపహాస్యం చేయడం, వాళ్లని జోకర్లుగా చేసి మాట్లాడటం వంటివి చెన్నైలో చూసేవాడినని పవన్ గుర్తు చేసుకున్నారు.బ్రాహ్మణులను సినిమాల్లో పరిహసించడం తనకు ఆవేదనను కలిగించిందన్నారు.

తన సినిమాల్లో ఎప్పుడూ కులం పేరును వాడలేదని, ఒక కులాన్ని పరిహాసం చేయలేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.సమాజం పట్ల తనకు బాధ్యత, విలువ ఉన్నాయి కాబట్టే అలాంటి పనులు చేయలేదన్నారు.జనసేన అధికారంలోకి వస్తే బ్రాహ్మణుల సంక్షేమానికి ఏటా రూ.2500 కోట్లు కేటాయిస్తామని పవన్ హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement

తాజా వార్తలు