బీఆర్ఎస్ లోకి జగ్గారెడ్డి ? 

ఇటీవల కాలంలో పార్టీలోకి చేరికలతో తెలంగాణ కాంగ్రెస్ ( Telangana Congress )లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

బీఆర్ ఎస్,  బిజెపి లకు దీటుగా తాము బలపడ్డామని నమ్ముతోంది.

వచ్చే ఎన్నికల్లో గెలుపు ధీమాతో ఉంది.అందుకే పార్టీలో చేరికలపై ఎక్కువగా దృష్టి సారించింది .బిజెపి అసంతృప్త నేతలను గుర్తించి తమ పార్టీలో చేర్చుకునే వ్యూహానికి గత కొంతకాలంగా తెరతీసింది.ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి చాలామంది కీలక నేతల కాంగ్రెస్ లో చేరారు.

ఈ చేరికలు ఉత్సాహంతో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ కు షాక్ తగిలేలా కనిపిస్తోంది.ఆ పార్టీ సీనియర్ నేత సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ( Jagga Reddy )బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

చాలాకాలంగా కాంగ్రెస్ లో అసంతృప్తితో జగ్గారెడ్డి ఉంటున్నారు.చాలా కాలం పాటు ఆయన గాంధీభవన్ కు కూడా హాజరు కాలేదు.

Advertisement

అలాగే పార్టీ నిర్వహించే సమావేశాలకు దూరంగానే ఉంటున్నారు.అనేక సందర్భాల్లో సీఎం కేసీఆర్( CM kcr ) పైనా,  ప్రభుత్వం పైన ప్రశంసలు కురిపించారు.దీంతో ఎప్పటి నుంచో జగ్గారెడ్డి బీఆర్ఎస్ లో చేరిపోతున్నారనే హడావుడి జరుగుతుంది.

అయితే ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో బీఆర్ఎస్ లో చేరేందుకు జగ్గారెడ్డి సిద్ధమైనట్లు సమాచారం.పార్టీ మారుతున్నారనే వార్తలు వస్తున్నా,  జగ్గారెడ్డి మాత్రం వాటిని ఖండించకపోవడం తో ఈ అనుమానాలు మరింతగా బలపరుస్తున్నాయి.

  వచ్చే ఎన్నికలో సంగారెడ్డి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా  ఆయన పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.ఇక కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) నియమించినప్పటి నుంచి జగ్గారెడ్డి అసంతృప్తితోనే ఉంటున్నారు.

బహిరంగంగానే రేవంత్ పైన అనేక విమర్శలు చేశారు.పార్టీ హై కమాండ్ కు అనేకసార్లు లేఖ రాశారు.అయినా జగ్గారెడ్డికి అనుకూలంగా నిర్ణయాలు వెలవడకపోవడం,  కాంగ్రెస్ నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఆయన మరికొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారట.

జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి
Advertisement

తాజా వార్తలు