ఎప్పుడూ ఏదో ఒక వివాదం ! ఇప్పుడు జగ్గారెడ్డి 

తెలంగాణ కాంగ్రెస్ ( Telangana Congress )లో ఎప్పుడూ ఏదో ఒక వివాదం చోటు చేసుకుంటూనే ఉంటుంది.

సొంత పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకుంటూ,  తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూ ఉంటారు.

ఎవరికి వారు తామే గొప్ప నాయకులం అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు.అలాగే అధిష్టానం వద్ద ఉన్న పరిచయాలను ప్రస్తావిస్తూ, పార్టీలోని ఇతర నాయకుల పైన విమర్శలు చేస్తూ ఉంటారు.

ఇవన్నీ తెలంగాణ కాంగ్రెస్ లో సర్వ సాధారణంగానే మారిపోయాయి.ఎప్పుడూ గ్రూపు రాజకీయాలతో తెలంగాణ కాంగ్రెస్ ఇబ్బందులు పడుతూనే వస్తోంది.

అధిష్టానం పెద్దలు ఎన్నిసార్లు కలుగజేసుకుని నచ్చచెప్పే ప్రయత్నం చేసినా, షరా మామూలే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలను స్వీకరించిన దగ్గర నుంచి సీనియర్ నాయకులు అంతా ఆయనపై విమర్శలు చేస్తూ,  తమ అసంతృప్తిని ఏదో ఒక సందర్భంలో వెళ్ళగకుతూనే వస్తున్నారు.

Advertisement

ఈ గ్రూపు రాజకీయాలతో కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్లో కలుగజేసుకునేందుకు అంత ఆసక్తి చూపించడం లేదు .ఇదిలా ఉంటే చాలు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి( Jaggareddy ) పెద్ద కొద్దిరోజులుగా  పార్టీలో  చోటుచేసుకుంటున్న వ్యవహారాలపై ఆగ్రహంతో ఉంటూ వస్తున్నారు.గతంలోనూ అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన తాజా గాంధీభవన్ రాజకీయాలు,  రాహుల్ సభలు, పాదయాత్ర ఖర్చు తదితర అంశాలను ప్రస్తావిస్తూ కాక రేపుతున్నారు .

2017 లో సంగారెడ్డిలో నిర్వహించిన రాహుల్ సభ( Rahul Gandhi )కు , అలాగే ఇటీవల భారత్ జోడో యాత్ర సందర్భంగా పార్టీ కార్యక్రమాలు, ర్యాలీలకు తాను పెద్ద మొత్తంలో సొమ్ములు ఖర్చు పెట్టానని,  అయినా పార్టీలో తనకు సరైన గుర్తింపు లేకపోవడం బాధాకరమని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గాంధీభవన్ లో ప్రశాంతత తొలిగిపోయిందని,  ఫ్రెండ్లీ పాలిటిక్స్ కూడా కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.తనకు అన్ని విధాలుగా నష్టం జరిగిందనే విధంగా జగ్గారెడ్డి ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తుండడం తెలంగాణ కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది.

ఇప్పుడిప్పుడే పార్టీ పుంజుకుంటున్న సమయంలో సొంత నేతలు ఇలా పార్టీకి డామేజ్ చేసే విధంగా వ్యవహరించడం సరికాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అక్కడ నాని మూవీ కేవలం 5 థియేటర్లలో రిలీజవుతోందా.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు