జగపతిబాబు అమ్మగారు ఇంటిని చూశారా...అచ్చం అడివిని తలపిస్తోందిగా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటిస్తూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ హీరో జగపతిబాబు(Jagapathi Babu) ఒకరు.

ఇలా హీరోగా ఎన్నో సినిమాలలో నటించిన ఈయన తన సెకండ్ ఇన్నింగ్స్ విలన్ పాత్రలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

అయితే ఈయనకు హీరోగా కన్నా విలన్ పాత్రలకే ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.ప్రస్తుతం వరుస సినిమాలతో జగపతిబాబు ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా మారిన జగపతిబాబు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే శ్రీరామనవమి(Srirama Navami) పండుగను పురస్కరించుకొని ఈయన తన అభిమానులకు శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా తన తల్లి ఇంటిని కూడా చూపించారు.శ్రీరామనవమి పండుగ సందర్భంగా తన తల్లి పానకం తాగడం కోసం పిలవడంతో పానకం తాగడానికి తన తల్లి ఇంటికి వచ్చానని జగపతిబాబు తెలిపారు.

Advertisement

అలాగే చాలా రోజుల తర్వాత అమ్మ చేతి వంట కూడా తినబోతున్నానని ఈయన వెల్లడించారు.ఇక తన ఇంటి ఎంట్రెన్స్ నుంచి లోపలికి వెళ్లాలంటే ఒక అడవిలో వెళ్తున్నామా అనే అనుభూతి తప్పకుండా కలుగుతుంది అలా ఇంటి ఆవరణ మొత్తం ఎత్తైన చెట్లు, పూల మొక్కలు వివిధ రకాల చెట్లు ఉండటం మనం ఈ వీడియోలో చూడవచ్చు.ఇక ఇదే విషయాన్ని జగపతిబాబు కూడా చెబుతూ మనం ఏదో అడవిలో వెళ్ళినట్టు ఉంటుంది కానీ మా అమ్మ ఇల్లు హైదరాబాద్ నడిబొడ్డున ఉందని తెలిపారు.

ఇక ఇంటి ఆవరణంలో ఒక ఋషి విగ్రహాలను కూడా ఏర్పాటు చేసి ఉంది.ఏది ఏమైనా ఈ వీడియోని కనుక చూస్తుంటే మనం ఏదో అడవిలోకి వెళ్తున్నామా అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కలగక మానదు.ఇలా తన తల్లి ఇంటి వీడియోని జగపతిబాబు షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

అయితే ఈ వీడియోలో తన తల్లిని మాత్రం చూపించలేదు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

విష్ణువు వరాహవతారం ఎత్తడానికి గల కారణం ఇదే..!
Advertisement

తాజా వార్తలు