జగన్ ఆవేశపడ్డాడు.. మేము ఆలోచనలో పడ్డాం.. టీడీపీ వైసీపీ మధ్య తేడా ఇదేనట

పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి వైసీపీ అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం లేపుతున్నాయి.

జగన్ వ్యాఖ్యలు పై పవన్ రియాక్ట్ అయినప్పటికీ .

దీనిమీద చర్చలు మాత్రం ఆగలేదు.ఈ వివాదాన్ని టీడీపీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.

అందుకే గతం లో టీడీపీ పై పవన్ చేసిన వ్యాఖ్యలు గురించి ప్రస్తావిస్తున్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ పై పవన్ అనేక ఆరోపణలు చేసాడు అయినా .ఎప్పుడూ పవన్ కల్యాణ్ ను వ్యక్తిగతంగా ఒక్కసారి కూడా విమర్శించలేదు.ఆధారాలు చూపించాలని మాత్రమే డిమాండ్ చేసాము అంటూ టీడీపీ వారు గుర్తుచేసుకుంటున్నారు.

టీడీపీతో పవన్ కలిసి తిరిగినప్పుడు చంద్రబాబు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారు.ప్రజా సమస్యలపై తనను కలవడానికి వచ్చినప్పుడు పవన్ కల్యాణ్ కు స్వయంగా స్వాగతం పలికేవారు.

Advertisement

వెళ్లేటప్పుడు కారు వద్దకు వెళ్లి సాగనంపేవారు.పవన్ చెప్పిన సమస్యలపై అఫ్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చేవారు.

లోకేష్, చంద్రబాబులపై జనసేన అధినేత పవన్ అవినీతి ఆరోపణలు చేసిన తర్వాత కూడా టీడీపీ విధానంలో మార్పు రాలేదు.అదే రాజకీయ పరమైన ఓ చిన్న విమర్శ చేస్తేనే జగన్ తట్టుకోలేకపోయారు.

ఈ వ్యత్యాసం చూపించి టీడీపీ పై జనసేనకు సానుభూతి కలిగేలా చేయాలని టీడీపీ నాయకులు ఆరాటపడిపోతున్నారు.

పవన్ టీడీపీ పై విమర్శలు చేసినప్పుడు తీవ్ర మనస్థాపానికి గురయ్యేవారు.లీగల్ యాక్షన్స్ కు సిద్దపడ్డారు కానీ.పవన్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేయాలనుకోలేదు.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...

జగన్ చేసిన వ్యాఖ్యలపై.పార్టీ నేతలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.

Advertisement

వ్యక్తిగత అంశాలపై ఎవరూ మాట్లాడవద్దన్నారు.ఈ అంశం వారూ వారూ తేల్చుకోవాల్సినదని స్పష్టం చేశారు.

ఇదీ ఆ పార్టీ విధానం.జగన్ మాత్రం పవన్ కల్యాణ్ చేసిన ఒక్క రాజకీయ విమర్శను సహించలేకపోయారు.

ఆయన విమర్శించడాన్ని ఖర్మగా చెప్పుకున్నారు.నైతిక ప్రవర్తన సరిగ్గా లేని వ్యక్తుల గురించి మాట్లాడాల్సి రావడం దౌర్భాగ్యమంటూ వ్యాఖ్యానించారు.

వ్యక్తిగత జీవితాన్ని విమర్శిస్తూ మాట్లాడాడు.వాస్తవానికి పవన్ కల్యాణ్ చేసిన రాజకీయ విమర్శలో ఎలాంటి తప్పూ లేదు.

దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం వైసీపీపై ఉంది.కానీ జగన్ వేరే రూట్లో వెళ్లి బొక్కబోర్లా పడ్డాడు.

ఇప్పటివరకు జగన పై అందరికి ఉన్న సాఫ్ట్ కార్నర్ పోయింది.