జ‌గ‌న్ కొత్త‌ ఆప‌రేష‌న్‌... ఈ సారి ఇద్ద‌రు ఎమ్మెల్యేలు జంప్ ?

ఏపీలో పంచాయ‌తీ ఎన్నిక‌లు ముగిశాయి.ప్ర‌స్తుతం కార్పొరేష‌న్‌, మునిసిపాలిటీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.

ఇప్ప‌టికే టీడీపీకి న‌లుగురు ఎమ్మెల్యేలు దూరం అయ్యారు.

పంచాయ‌తీ ఎన్నికల దెబ్బ చూసిన మ‌రి కొంద‌రు ఎమ్మెల్యేలు.

మునిసిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాలు చూశాక పార్టీని వీడాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చేశార‌ని తెలుస్తోంది.పంచాయ‌తీ ఎన్నికల్లో దాదాపు 80 శాతం వైసీపీ గెలుచుకుంది.

పల్లె ప్రాంతాల్లో ఏమాత్రం పట్టుతగ్గలేదని ఈ ఫలితాలను బట్టి వెల్లడవుతుంది.రేపు ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోనూ ఇదే ప‌రిస్థితి ఉంటే.

Advertisement
Jagans New Operation Two MLAs Jump This Time, Ap,ap Political News,latest News,

చాలా మంది ఎమ్మెల్యేలు టీడీపీకి దూరం జ‌ర‌గాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌.టీడీపీని మ‌రింత వీక్ చేసే క్ర‌మంలోనే జ‌గ‌న్ మునిసిపోల్స్ త‌ర్వాత మ‌రోసారి ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు తెర‌లేపేలా ప్లాన్ చేశార‌ట‌.

ఈ దెబ్బ‌తో టీడీపీని పూర్తిగా స్మాష్ చేయాల‌న్న‌దే జ‌గ‌న్ ప్లాన్‌.ఇప్ప‌టికే పార్టీకి దూర‌మైన న‌లుగురు ఎమ్మెల్యేలు కాకుండా మ‌రో 8 - 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటూ వస్తున్నారు.

పార్టీ అధిష్టాన‌మే పార్టీలో ఎవ్వ‌రిని న‌మ్మ‌లేని ప‌రిస్థితి ఉంది.ఇన్నాళ్లూ రాజధాని వ్యవహారం జగన్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుందని భావించారు.

కానీ అమరావతి ప్రాంతంలోనే టీడీపీకి గెలుపు దక్కలేదు.

Jagans New Operation Two Mlas Jump This Time, Ap,ap Political News,latest News,

తాడికొండ‌, మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గాల్లోనే వైసీపీ ఘ‌న‌విజ‌యం సాధించింది.రేప‌టి రోజున ప‌ట్ట‌ణాల్లోనూ ఇదే ఫ‌లితాలు వ‌స్తే పార్టీ కండువా మార్చేందుకు మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నార‌ని అంటున్నారు.వీరిలో వైజాగ్ సిటీలో వ‌రుస విజ‌యాలు సాధిస్తోన్న ఓ ఎమ్మెల్యే ( గంటా శ్రీనివాస‌రావు కాదు) పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది.

Advertisement

ఇక కోస్తాలో మ‌రో ఎమ్మెల్యే కూడా పార్టీ మారే విష‌యంలో దూకుడుగానే ఉన్నారంటున్నారు.ఇక సీమ జిల్లాల్లో మ‌రో సీనియ‌ర్ ఎమ్మెల్యే కూడా పార్టీలో కీల‌క ప‌ద‌విలో ఉండి పార్టీకి దూరంగా ఉంటున్నారు.

ఆయ‌న్ను కూడా న‌మ్మే ప‌రిస్థితి లేద‌ట‌.వీరు మునిసిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాలు చూసుకుని ఎప్పుడైనా పార్టీ మారిపోవ‌చ్చ‌నే అంటున్నారు.

తాజా వార్తలు