జగన్మోహన్ రెడ్డి మాకు ఒక వ్యసనం ఆయన కోసం ఏమైనా చేస్తా..అనిల్ కుమార్ యాదవ్

రాజకీయాల్లో ఉన్నంత కాలం నా చివరి శ్వాస వరకు జగన్ వెంటే ఉంటా.జగన్ కోసమే పని చేస్తా.

జగనన్న నన్ను తరిమేసినా.తిట్టినా.

Jaganmohan Reddy Is An Addiction To Us, We Will Do Anything For Him..Anil Kumar

నువ్వు ఈ పార్టీలో ఉండొద్దని చెప్పినా.నా తండ్రి సాక్షిగా చెబుతున్న నేను జగన్ వెంటే ఉంటా.

వేరే గుమ్మం తొక్కే ప్రసక్తే లేదు.జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) మాకు ఒక వ్యసనం.

Advertisement

ఆయన కోసం ఏమైనా చేస్తా.నేను ఎమ్మెల్యే అయినా.

మంత్రి అయినా అది నాకు జగన్ బిక్ష.నేను కొందరితో దూరంగా ఉంటున్నా.

ఒక మనిషి పై మనకు మంచి అభిప్రాయం లేనప్పుడు దూరంగా ఉండటం మేలు.ఒక పెళ్లికి వెళ్లి అక్షింతలు వేసి తాళి ఎప్పుడు తెగుతుందా అని దీవించే కన్నా పెళ్లికి వెళ్లకపోవడమే మేలని భావించే వ్యక్తిని నేను.

పక్క పక్కన కూర్చుని వీడి ఎప్పుడు నాశనం అయిపోతాడా అని కోరుకునే బదులు దూరంగా ఉండడమే గౌరవo.దాని ప్రకారమే నేను నడుచుకుంటున్నా.అందుకే కొందరితో విభేదాలు.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
బిగ్ బాస్ వల్ల నా జీవితం నాశనం అయ్యింది... ఎన్టీర్ మాట వినాల్సింది : సంపూర్ణేష్ బాబు 

పేరున్న గొర్రె కన్నా ఒంటరిగా సింహం గా ఉండటం మేలు.సంవత్సరం పాటు నా గురించి కొందరు రకరకాలుగా మాట్లాడారు.

Advertisement

సమయం వచ్చినప్పుడు అవన్నీ సీఎం జగన్ కు చెప్తా.బాధ కలిగితే కచ్చితంగా సీఎం జగన్ చెప్పుకుంటా.

అనిల్( Anil Kumar Yadav ).నెల్లూరు సిటీలో ఓడిపోతావు.నువ్వు తప్పుకో అని సీఎం జగన్ చెబితే బంగారంగా తప్పుకుంటా.

ఇది నాకు జగన్ ఇచ్చిన పదవి.ఆయన తీసుకుంటానంటే ఎలాంటి అభ్యంతరం చెప్పను.

రాజకీయాల్లో నా భవిష్యత్తును ఆ భగవంతుడు, జగన్మోహన్ రెడ్డి, నెల్లూరు ప్రజలు నిర్ణయిస్తారు.అనారోగ్యం కారణంగా కొన్ని రోజులు గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆపుతున్నా.

వైసీపీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలవరని నేను మాట్లాడినట్లు వస్తున్న వార్త ఫేక్ న్యూస్.

తాజా వార్తలు