జగనన్న ఆరోగ్య సురక్ష పధకం పేదలకు గొప్ప గొప్ప వరం.. మంత్రి విడదల రజని

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చిలకలూరిపేట నియోజకవర్గ మురికిపూడి గ్రామంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని( Rajini Vidadala ) ముఖ్యఅతిథిగా పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ ను పరిశీలించారు.

అనంతరం మంత్రి రజిని మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష పధకం పేదలకు గొప్ప వరమని, ఈ కార్యక్రమాని ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.నిరుపేదలకు ఉచితంగా సేవలు అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైయస్.

జగన్ మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) ప్రతి గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం( Jagananna Aarogya suraksha Schem ) ఏర్పాటు చేస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజలందరికీ ఉచితంగా సాధారణ జబ్బులతో పాటు బీపీ, షుగర్, గుండె, కంటికి, వివిధ అన్ని రకాల జబ్బులు సంబందిత రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి, వైద్య నిపుణులచే మందులు అందజేస్తున్నారన్నారు.

అవసరమైతే ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ కు రిఫర్ చేసి అక్కడ మెరుగైన వైద్య సేవలు అందజేస్తారన్నారు.దీర్ఘకాలంగా అనారోగ్యానికి గురైన వ్యక్తులతో పాటు, ఇంటికే పరిమితమైన వృద్దులకు, డాక్టర్లు ఇంటి వద్దకే వెళ్లి వైద్య సేవలు అందిస్తున్న తీరుపై ప్రజలు నుండి హర్షత రేఖలు వెల్లువెత్తుతున్నాయన్నారు.

Advertisement

కార్యక్రమం లో ప్రత్యేక వైద్య నిపుణులు బృందం, వైద్య సిబ్బంది, అధికారులు, సచివాలయ సిబ్బంది.అంగన్వాడి సిబ్బంది.

ఆశావర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు