లోటు బడ్జెట్ రాజధాని నిర్మాణం జగన్ ఎదురుగా ఉన్న పెద్ద సవాళ్లు

ఏపీ రాజకీయాలలో ఊహించని రీతిలో అఖండ విజయం సొంతం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా మొదటి రోజు నుంచే తన మార్క్ చూపించే ప్రయత్నం మొదలుపెట్టాడు.

తాను ప్రజలకి హామీ ఇచ్చిన నవ రత్నాలు మీద ముందుగా ద్రుష్టి పెట్టిన జగన్ వాటిని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

ఇక ఏపీలో అమరావతి, పోలవరం, పారిశ్రామిక అభివృద్ధి అనే అంశాలకి రెండో ప్రాధాన్యత ఇచ్చి హామీలు అమలు చేయడం మీదనే ద్రుష్టి పెట్టాడు.ఇక ఈ హామీలు అమలు చేసిన తర్వాత ఏపీ అభివృద్ధి విషయంలో జగన్ కి వరుస సవాళ్లు ఎదురవుతాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Jagan Feature Plans On Amaravathi1 1-లోటు బడ్జెట్ రా

ఈ సవాళ్ళని జగన్ ఎలా ఎదుర్కొంటాడు.ఏపీని అభివృద్ధి పటంలో ఎలా ముందు నిలబెడతాడు అనే దాని కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గత ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఎన్నికలలో ఇచ్చిన హామీలు పక్కన పెట్టి రాజధాని నిర్మాణం మీద ద్రుష్టి పెట్టింది.తరువాత ఒక్కొక్కటిగా హామీలు అమలు చేయడం మొదలు పెట్టిన అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది.

Advertisement

ఈ కారణంగా జగన్ ముందుగా హామీలు అమలు చేసి తరువాత అభివృద్ధిపై ద్రుష్టి పెట్టబోతునట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.అయితే జగన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అప్పులు, లోటు బడ్జెట్ ని తగ్గించడానికి ఎలాంటి ప్రణాళికలతో పరిపాలన సాగిస్తాడు అనేది పెద్ద ప్రశ్నగా ఉంది.

అదే సమయంలో రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో జగన్ ఆలోచన ఎలా ఉంది.దానిని ఎలా నిర్మిస్తాడు అనేది కూడా రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా ఉంది.

ఈ రెండు విషయాలని జగన్ హ్యాండిల్ చేసే దాని బట్టి వచ్చే ఎన్నికలలో వైసీపీ గెలుపు, ఓటములు ఆధారపడి ఉంటాయి అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట.

తాజా వార్తలు