జగన్ కు ఇకనుంచి తిప్పలే..!

ఏపీలో వచ్చే ఎనికల దృష్ట్యా వైఎస్ జగన్మోహన్ రెడ్డి( YS Jaganmohan Reddy ) లక్ష్యం ఏంటో అందరికీ తెలిసిందే.

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా 175 స్థానాల్లో విజయ సాధించాలనేది ఆయన టార్గెట్.

అయితే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అంతా ఈజినా ? ఇంతకీ సాధ్యమయ్యే పనేనా ? అంటే అటు విశ్లేషకుల నుంచి గాని ఇటు ఏపీ ప్రజల నుంచి గాని అంతలేదు అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది.కానీ వైసీపీ( YCP ) నేతలు మాత్రం వైనాట్ 175 పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

ఈసారి ఎన్నికల్లో వైసీపీ తప్పకుండా 175 స్థానాల్లో విజయం సాధిస్తుందిని చెబుతూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.అయితే ప్రస్తుతం ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీ ( TDP )స్కామ్ ల ఉభిలో చిక్కుకుంది.

అధినేత చంద్రబాబు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు.

Advertisement

నారా లోకేష్( Nara Lokesh ) కూడా రేపో మాపో అరెస్ట్ అవుతారనే సంకేతాలు కనిపిస్తున్నాయి.అటు జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల పవన్ పై అభిమానం చూపించే వారు కూడా దురమౌతారని వైసీపీ విశ్లేషకులు చెబుతున్నారు.దీంతో ప్రస్తుతం అన్నీ పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా మారుతున్నాయని, అందుకే వైనాట్ 175 టార్గెట్ ను మరోసారి నేతలకు గుర్తు చేశారు అధినేత జగన్మోహన్ రెడ్డి.

వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలను కైవసం చేసుకొని తీరాలని పట్టుదలతో ఉన్నారు.ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి అసలు పార్టీలో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఎప్పుడు అసలు చర్చ.

ఇప్పటికే ఆయా నియోజిక వర్గాల్లో వర్గపోరు వైసీపీని వెంటాడుతోంది.ఆ మద్య అనిల్ కుమార్ యాదవ్ ( Anil Kumar Yadav )మరియు రూప్ కుమార్( Roop Kumar ) వివాదం, అలాగే రామచంద్రపురం నియోజిక వర్గం విషయంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ మరియు వేణుగోపాల్ మద్య రగడ,ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నియోజిక వర్గాల్లో వైసీపీ అంతర్మథనంతో కొట్టు మిట్టాడుతోంది.

పైగా ఇటీవల పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశంలో టికెట్ల కేటాయింపుపై కూడా స్పష్టతనిచ్చారు అధినేత జగన్మోహన్ రెడ్డి.సర్వేల ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని, బహుశా కొంతమందికి టికెట్లు దక్కకపోవచ్చని కూడా స్పష్టం చేశారు.దీంతో ఓ 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను జగన్ పక్కన పెట్టె ఆలోచనలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?

ఇదే ఇప్పుడు ఆ పార్టీలో మరింత కలవరనికి దారి తీస్తోంది.ఎందుకంటే టికెట్లు దగ్గని వారు అదే పార్టీలో ఉంటారా లేదా జంప్ అవుతారా అనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

కొంతమందికి టికెట్లు దక్కవని జగన్ ముందుగానే చెప్పడంతో ప్రస్తుతం వ్యతిరేక సంకేతాలు ఉన్న సిట్టింగ్ ఎమ్మేల్యేలు ఇప్పటి నుంచే పార్టీ మరెందుకు సిద్దమౌతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇకనుంచి పార్టీలో నేతలు జంప్ అవ్వకుండా నేతలను కాపాడుకోవడమే జగన్ కు పెద్ద టాస్క్ అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

తాజా వార్తలు