`విశాఖ‌` పాద‌యాత్ర‌ల‌కు జ‌గ‌న్ బ్రేక్‌..!

విశాక ఉక్కు ఉద్య‌మానికిమ‌ద్ద‌తుగా ఇద్ద‌రు వైసీపీ నాయ‌కులు పాద‌యాత్ర‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు.ఇప్ప టికే దీనికి సంబంధించిన రూట్ మ్యాప్‌ను కూడా రెడీ చేసుకున్నారు.

వీరిలో ఒక‌రు మంత్రి అవంతి శ్రీనివాస్ కాగా, రెండో వారు ఉత్త‌రాంధ్ర వైసీపీ ఇంచార్జ్.ఎంపీ విజ‌యసాయిరెడ్డి.

వీరిద్ద‌రూ కూడా పోటా పోటీగా కాక‌పోయినా.ఉక్కు ఉద్య‌మానికి సంబంధించి.

ఇత‌ర పార్టీల‌ను హైజాక్ చేసేలా.వ్య‌వ‌హ‌రిస్తు న్నారు.

Advertisement
Jagan Break For Visakha Padayatara, Ap,ap Political News,latest News,political T

అయితే.వీరు నిర్ణ‌యించుకున్న ఈ పాద‌యాత్ర‌ల‌కు సీఎం జ‌గ‌న్ బ్రేక్ వేసిన‌ట్టు తాజాగా స‌మాచారం అందుతోంది.

ఉక్కు ఉద్య‌మం .కొన‌సాగాల‌ని స్వ‌యంగా జ‌గ‌న్ కూడా పిలుపునిచ్చిన‌ప్ప‌టికీ.పాద‌యాత్ర‌ల‌కు మాత్రం ఆయ‌న అడ్డు చెప్ప‌డం పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

తాజాగా విశాఖ‌లో ప‌ర్య‌టించిన జ‌గ‌న్‌ను అక్క‌డి కార్మిక సంఘాలు విశాఖ విమానాశ్ర‌యంలో భేటీ అయి.త‌మ స‌మ‌స్య‌ల‌ను చెప్పుకొన్నాయి.ఈ స‌మ‌యంలో ఉక్కు ఉద్య‌మం కొన‌సాగించాల‌ని జ‌గ‌న్ ఆదేశించా రు.అయితే.అదేస‌మ‌యంలో ఇక్క‌డ టీడీపీ స‌హా ఇత‌ర ప‌క్షాలు చేస్తున్న ఉద్య‌మాల‌పై కూడా జ‌గ‌న్ ఆరాతీశారు.

ఈ క్ర‌మంలోనే మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు.రాజీనామా, ప‌ల్లా శ్రీనివాస‌రావు ఆమ‌ర‌ణ దీక్ష‌.వంటివి చ‌ర్చ‌కు వ‌చ్చాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

ఈ స‌మ‌యంలో అధికార పార్టీగా ఉండి.పాద‌యాత్ర‌లు చేయ‌డం ద్వారా.

Advertisement

పార్టీకి మెరిట్ రాద‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు సీనియ‌ర్లు చెప్పుకొంటున్నారు.

`మ‌నం పాద‌యాత్ర చేయ‌డం ద్వారా.మంచి సింప్ట‌మ్స్ రావు.సో.ఇప్ప‌టికి వ‌ద్దు`` అని ముక్త‌స‌రిగా జ‌గ‌న్ చెప్పిన‌ట్టు తెలుస్తోంది.ఈ ఆదేశాలు రావ‌డంతో అప్ప‌టి వ‌ర‌కు చేసుకున్న ఏర్పాట్ల‌పై అటు మంత్రి, ఇటు సాయిరెడ్డి కూడా వెన‌క్కి త‌గ్గార‌ని తెలుస్తోంది.

పాద‌యాత్ర‌ల‌పై పున‌రాలోచ‌న‌లో ప‌డ్డార‌ని.ఇప్ప‌టికే వైసీపీ వ‌ర్గాల ద్వారా.

విశాఖ నాయ‌క‌త్వానికి.స‌మాచారం చేరిపోయింది.

పాద‌యాత్ర‌లు చేయ‌డం వ‌ల్ల‌.ప్ర‌భుత్వం చేతులు ఎత్తేసింద‌నే వ్యాఖ్య‌లు బ‌ల‌ప‌డ‌తాయ‌ని.

ఇప్పుడు మ‌నం ఏం చేసినా.కేంద్రంలోనే చేయాల‌ని.

స్థానికంగా మాత్రం అన్ని ఉద్య‌మాల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని జ‌గ‌న్ సూచించార‌ని సీనియ‌ర్లు చెప్పుకొంటున్నారు.అయితే.

పూర్తిగా పాద‌యాత్ర‌ల‌ను ప‌క్క‌న పెడ‌తారా?  లేక‌.ప్ర‌స్తుతానికి ఈ నిర్ణ‌యం తీసుకున్నారా? అనే ది తెలియాల్సి ఉంది.అయితే.

కేంద్రంపై ఒత్తిడి పెంచే కార్య‌క్ర‌మానికి మాత్రం నాయ‌కులు రెడీ కావ‌డం గ‌మ‌నార్హం.

తాజా వార్తలు