Prabhas : ప్రభాస్ కు కూడా అప్పు ఉండడానికి కారణం అదేనా? ఆ మంచి తనమే అప్పులపాలు చేసిందా?

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ చేతినిండా నాలుగైదు పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే.ప్రభాస్ నటించిన ఆది పురుష్( Adipurush ) సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

సలార్, ప్రాజెక్ట్ కే, రాజా డీలక్స్ లాంటి సినిమాలలో బిజీ బిజీగా గడుపుతున్నారు ప్రభాస్.ఇకపోతే ప్రభాస్ ఆతిథ్యం గురించి మనందరికీ తెలిసిందే.

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీలు హీరో ప్రభాస్ ఇంట్లో చేసే ఫుడ్ ని ఎంతగానో ఇష్టపడతారు.

Jabardasth Mahesh Talking About Prabhas In Shooting
Advertisement
Jabardasth Mahesh Talking About Prabhas In Shooting-Prabhas : ప్రభా�

గతంలో చిరంజీవి లాంటి స్టార్ సెలబ్రిటీలకు కూడా ప్రభాస్ ఇంట్లో చేసిన వంటకాలను పంపించిన విషయం తెలిసిందే.ఉప్పలపాటి కుటుంబం అంటే తిండి పెట్టి చంపేస్తారు అన్న పేరు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఇదే విషయాన్ని జబర్దస్త్ కమెడియన్ మహేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

రంగస్థలం మహేష్ ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు.ఈ నేపథ్యంలోనే ఈ షూటింగ్లో ప్రభాస్ జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చారు.మాట ఇచ్చాక నిలబెట్టుకోవడమే ప్రభాస్ గొప్పతనం.

Jabardasth Mahesh Talking About Prabhas In Shooting

మారుతి గారి సినిమాలో ప్రభాస్ అన్ స్టాపబుల్ షోలో కనిపించినట్లుగా ఉంటారని తెలిపారు మహేష్.అనంతరం ప్రభాస్ షూటింగ్ సమయంలో తెప్పించిన ఫుడ్ గురించి మాట్లాడుతూ.షూటింగ్ సమయంలో .200, 300 మందికి ఫుడ్ తెప్పించారు.అందరూ కుమ్మేసాము.

నేను మటన్ బాగా తిన్నాను.నేనేతై దాడి చేశాను.

వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?

ఏం నచ్చింది రా అని అడిగారు.మటన్ అన్నా అనగానే మళ్లీ రేపొద్దున మహేష్‌( Mahesh )కు మటన్ తెప్పించండి అన్నారు.

Advertisement

ఆయనే ఇంటి నుండి వండించి, పంపించారు.అందరూ చెబుతుంటే విన్నాను కానీ ఆ రోజు చూశాను.

నెక్ట్ లెవల్ అంతే అంటూ ప్రభాస్ ఇంటి వంటలపై ప్రశంసలు కురిపించాడుమహేష్.

ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.కొద్దిరోజులుగా ప్రభాస్ అప్పుల్లో ఉన్నాడని, అప్పులు చాలా చేశాడు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.ఈ వార్తలకి ప్రభాస్ ఇంటి వంటకాలకు చాలామంది లింక్ పెడుతూ అలా అంతమందికి భోజనాలు పెట్టడం వల్లే ప్రభాస్ అప్పుల పాలయ్యాడు.

ప్రభాస్ మంచితనమే అప్పుల పాలు చేసింది అంటూ కామెంట్ చేస్తున్నారు.

తాజా వార్తలు