జనసేన ప్రచారానికి కోట్లలో డీలింగ్.. అసలు విషయం బయటపెట్టిన గెటప్ శ్రీను?

మరొక వారం రోజులలో ఏపీలో ఎన్నికలు( AP Elections ) జరగబోతున్నాయి.ఈ తరుణంలోనే అన్ని పార్టీలు ప్రచార కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.

ఇకపోతే సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పిఠాపురం( Pithapuram ) నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.అయితే ఈయన గత ఎన్నికలలో భాగంగా భీమవరం గాజువాక ప్రాంతాలలో పోటీ చేసినప్పటికీ కూడా గెలవలేకపోయారు.

ఇక జనసేన పార్టీ( Janasena Party ) నుంచి కేవలం ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రమే గెలిచారు.

ఇలా గత ఎన్నికలలో ఘోర పరాజయమైనటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు.ఇక ఈయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేస్తూ ఉండగా పిఠాపురంలో మాత్రం పవన్ కళ్యాణ్ తరపున ఇప్పటికే మెగా హీరోలు అలాగే జబర్దస్త్ కమెడియన్లు( Jabardasth Comedians ) టీవీ ఆర్టిస్టులు అందరూ కూడా పిఠాపురం చేరుకొని జనసేన పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.అయితే వీరందరూ కూడా ప్రచార కార్యక్రమాలు చేయటానికి కోట్లలో డీల్ కుదుర్చుకొని ప్రచార కార్యక్రమాలకు వచ్చారని వార్తలు వస్తున్నాయి.

Advertisement

పవన్ కళ్యాణ్ కోసం వారంతా వారి షూటింగ్స్ వదులుకొని వచ్చారు.అందుకోసమే భారీ స్థాయిలో డబ్బు తీసుకుంటున్నారని కూడా వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈ వార్తలపై ఇటీవల తన సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి గెటప్ శ్రీను( Getup Srinu ) క్లారిటీ ఇచ్చారు.పవన్ కళ్యాణ్ అభిమానులుగా మాత్రమే పిఠాపురంలోకి వెళ్లి ప్రచార కార్యక్రమాలను నిర్వహించామే తప్ప డబ్బు తీసుకొని కాదని తెలియజేశారు.

పవన్ కళ్యాణ్ ఎంతో నిజాయితీ పరుడు అందరికీ సహాయం చేసే గుణం అతనికి ఉంది మంచితనం కారణంగానే ప్రచారానికి వచ్చాము.ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే మా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాము చెక్ చేసుకోవచ్చు అంటూ కూడా క్లారిటీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు