చెన్నైలో ఐటీ రైడ్స్..! నెలకొన్న ఉద్రిక్తత

చెన్నైలో ఐటీ దాడుల కలకలం చెలరేగింది.తమిళనాడు డీఎంకే మంత్రి వి సెంథిల్ బాలాజీ నివాసంలో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.

మంత్రికి చెందిన సుమారు 40 ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే మంత్రి సెంథిల్ సోదరుడు అశోక్ నివాసానికి సోదాలు నిర్వహించేందుకు వెళ్లిన ఐటీ అధికారులను డీఎంకే కార్యకర్తలు అడ్డుకున్నారు.

అయితే కార్యకర్తలను దాటుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయడంతో ఐటీ అధికారులను అడ్డుకున్నారు.ఈ క్రమంలో అధికారులకు, డీఎంకే కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం జరిగింది.

దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

తాజా వార్తలు