Kishan reddy : కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం రాయడం ఖాయం..: కిషన్ రెడ్డి

కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం రాయడం ఖాయమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి( Union Minister Kishan reddy ) అన్నారు.

సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పలు కాలనీల్లో పర్యటించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

రానున్న లోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha elections ) విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు.దేశ ప్రజలంతా మరోసారి ప్రధానిగా మోదీ( Narendra Modi )నే రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే రానున్న ఎన్నికల్లో బీజేపీ మూడు వందలకు పైగా సీట్లను సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.అలాగే మిత్ర పక్షాలతో కలిసి మరికొన్ని సీట్లు సాధించి మోదీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

రోజుకు ఐదు నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..?!
Advertisement

తాజా వార్తలు