ఈ సంవత్సరం దీపావళికి కొత్తవారు కూడా నోములు నోచుకోవచ్చా..!

దీపావళి పండుగ అంటే కేవలం టపాసుల పండగ మాత్రమే కాదు అని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే మహిళలకు నోముల పండుగ కూడా అని చెబుతున్నారు.

ఈ దీపావళికి ప్రత్యేకంగా నోములు నోచుకుని లక్ష్మీదేవిని( Lakshmi Devi ) పూజించడం సంప్రదాయంగా వస్తూ ఉంది.ఈ సంవత్సరం ఆదివారం రావడంతో మహిళలు ఈ నోములు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

అంతే కాకుండా ఆదివారమే నోములు నిర్వహించుకోవాలని పండితులు చెబుతున్నారు.అలాగే అమావాస్య సోమవారం మధ్యాహ్నం వరకు ఉండడంతో ఆదివారం నోములు చేసుకోవడం మంచిది అని చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే ఈ సంవత్సరం దీపావళి స్వాతి నక్షత్రంలో( Swathi Nakshatram ) వచ్చింది.కాబట్టి కొత్త వారు కూడా నోములు నోచుకోవచ్చని పండితులు చెబుతున్నారు.అలాగే కొత్త వారు ఈ సంవత్సరం నోములు నోచుకోవాడం మంచిదని సూచిస్తున్నారు.

Advertisement

ఈ సంప్రదాయం ప్రకారం ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలోని మహిళలు నోములు నోచుకుంటారు.తెలంగాణ రాష్ట్రంలోని( Telangana ) చాలా మంది ప్రజలు బంధువులను పిలిచి లక్ష్మీదేవికి పూజలు చేసి నోములు నోచుకుని బంధుమిత్రులకు భోజనాలు పెడతారు.

అంతే కాకుండా అందరూ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణలో దీపావళి( Diwali ) సందర్భంగా కేదారీశ్వరి వ్రతం కూడా చేసుకుంటారు.

ఈ వ్రతం చేస్తే అష్టైశ్వర్యాలకు, అన్న వస్త్రాలకు లోటుండదని చాలా మంది ప్రజలు నమ్ముతారు.అందుకే కేదారీశ్వరి వ్రతం( Kedareshwari Vrat ) చేసుకోవడం ఆనవాయితీగా వస్తు ఉంది.ప్రధానంగా మహిళలు లక్ష్మీ పూజలు చేస్తుంటారు.

దీపావళి రోజు సాయంత్రం వ్యాపారులు లక్ష్మీ పూజలు నిర్వహించి కొత్త ఖాతా పుస్తకాలను మొదలుపెడతారు.ఇది మార్వాడి లు ఎక్కువగా చేస్తూ ఉంటారు.

పొరుగింటి వ్యక్తిని చెప్పుతో కొట్టిన లేడి పోలీస్... వీడియో వైరల్...
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా 100 రోజుల ఫంక్షన్ చేసుకోడానికి.. అభిమానులు ఎన్నేళ్లు వెయిట్ చేశారో తెలుసా?

ఆ రోజు నుంచే వారికి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుందని నమ్ముతారు.అలా అందరూ ఆనందంగా నోములు చేసుకుని సాయంత్రానికి టపాసులు పేల్చుకుని, దీపావళి పండుగను సంతోషంగా జరుపుకుంటారు.

Advertisement

తాజా వార్తలు