"పవన్' ప్లెక్శీల వివాదం!!!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు హీరో మాత్రమే కాదు.పాలిటీషియన్ కూడా.

అయితే ఆయన్ని వాడేసుకోవడం కోసం చాలా మంది నేతలు క్యూ లోనే ఉన్నారు.ఇదిలా ఉంటే కృష్ణా జిల్లాలో పవన్ కల్యాణ్ ప్లెక్శీల విషయం రచ్చకెక్కింద.

విషయం ఏమిటంటే.జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీల తొలగింపు కృష్ణా జిల్లాలో వివాదానికి దారి తీసింది.

కృష్ణాజిల్లా గూడూరు మండలం రామన్నపేటలో పవన్‌ కళ్యాణ్‌ ఫ్లెక్సీపై వివాదం చెలరేగింది.సంక్రాంతి సమయంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ స్థానిక టీడీపీ నేతలు పవన్‌ కల్యాణ్‌ ఫోటోలు ఉన్న ప్లెక్సీని ఏర్పాటు చేశారు.

Advertisement

వీటిని గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.పోలీసులకు పిర్యాదు చేసి, రోడ్డుపై బైఠాయించారు.

ఫ్లెక్సీని చించేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.ఇది ఎవరు చేసారో.

ఎందుకు చేసారో తెలీదు, దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

సీతాదేవి రావణాసురుడి కూతురా? అందుకే రావణ వథ జరిగిందా?
Advertisement

తాజా వార్తలు