హమాస్ నీ ఐసిస్ తో పోలుస్తూ వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్ ప్రధాని..!!

ప్రపంచవ్యాప్తంగా అనేక ఉగ్రవాద సంస్థలు( Terrorist organizations ) ఉన్న సంగతి తెలిసిందే.

అయితే అన్నిటిలో కెల్లా ఐసిస్ ఉగ్రవాద సంస్థకు చెందినవారు చాలా క్రూరంగా కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటారు.

ఐసిస్ ఉగ్రవాదుల చేతికి దొరికితే మేడ మీద తలకాయ ఉండదు.ఇంక రకరకాలుగా మనుషులని హింసలు పెట్టి చంపేస్తుంటారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇజ్రాయెల్ ( Israel )హమాస్ ఉగ్రవాదుల మధ్య బీకరమైన పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ పోరులో సామాన్యులు బలైపోతున్నారు.

అక్టోబర్ 7వ తారీకు ఉదయం 6:30 గంటలకు ఇజ్రాయెల్ దక్షిణ భూభాగంలో చొరబడిన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పౌరులపై మరియు ఇజ్రాయెల్ సైనికులను దొరికిన వారిని దొరికినట్టు చంపేశారు.అక్టోబర్ 7వ తారీకు ఇజ్రాయెల్ సైనికులను ప్రాణంతో పట్టుకుని వారిని గాజా ప్రాంతానికి తరలించి దారుణంగా చంపటం ఆ వీడియోలు సోషల్ మీడియాలో రావడం తెలిసిందే.

Advertisement

పరిస్థితి ఇలా ఉంటే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ( Israeli Prime Minister Benjamin Netanyahu )ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు.హమాస్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ లాంటిదని స్పష్టం చేయడం జరిగింది.

ఈ వీడియోలో హమాస్.ఇజ్రాయెల్ పౌరులపై చేస్తున్న దాడులు చూపించడం జరిగింది.

కచ్చితంగా హమాస్ చేసిన దాడులకు తగిన రీతిలో మూల్యం చెల్లించుకుంటారని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేయడం జరిగింది.

వ్యాయామాల‌ త‌ర్వాత ఈ డ్రింక్స్ తాగితే సూప‌ర్ బెనిఫిట్స్‌!
Advertisement

తాజా వార్తలు