ప్రతి మెట్రో స్టేషన్ లో ఐసోలేషన్ రూమ్స్ ఏర్పాటు

అన్ లాక్-4 పక్రియ కొనసాగడంతో ఈ నెల 7వ తేదీ నుంచి మెట్రో సర్వీసులు తిరిగి ప్రారంభమవుతాయని హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.

ఈ విషయంపై శనివారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, పాటించాల్సిన నిబంధనల గురించి ఆయన వెల్లడించారు.ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.

‘‘సెప్టెంబర్ 7 నుంచి మెట్రో స్టేషన్లు ప్రారంభం కానున్నాయి.ఈ మేరకు కోవిడ్ నిబంధనలను ప్రతి ప్రయాణికులు పాటించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.

ఇప్పటికే అన్ని స్టేషన్ లో థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లను ఏర్పాటు చేశాం.శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉంటేనే స్టేషన్ లో అనుమతి ఉంటుంది.

Advertisement

ముఖానికి తప్పని సరిగా మాస్కు ధరించాలి.ఒక వేళ మాస్క్ లేకపోతే స్టేషన్ కొనుక్కోవచ్చు.

హ్యాండ్ శానిటైజర్లను అందుబాటులో ఉంచుతాం.కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఇప్పటికే రైళ్లలో మార్కింగ్ లను ఏర్పాటు చేశాం.

ప్రయాణికులు ఆ మార్కింగ్ కి తగ్గట్లు నడుచుకోవాలి.ప్రతి 5నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంటుంది.

కాబట్టి ప్రయాణికులు రైలులో ఎక్కువ మంది ప్రయాణించవద్దు.రైలు బోగీల్లో 75 శాతం ఆక్సిజన్ అందేలా చర్యలు తీసుకుంటున్నాం.

ఆడ వారి క్రికెట్ కు మగవారి క్రికెట్ కు మ‌ధ్య ‌ ఉండే ముఖ్యమైన 5 తేడాలు!

’’ అని ఆయన వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు