ఎలన్ మస్క్.ఈ పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లదనే చెప్పాలి.
ఎందుకంటే ఈ ప్రపంచంలోనే అపర కుబేరుల్లో ఎలన్ మస్క్ కూడా ఒకరు.అంత ఆస్థి ఉన్న ఆయనకు సొంత ఇల్లు లేదంటే ఎవరన్నా నమ్ముతారా.
కానీ నిజంగానే ఎలన్ మస్క్ కు సొంత ఇల్లు లేదు.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
మొదట పేపాల్ తో మొదలైన ఎలన్ మస్క్ ప్రస్థానం టెస్లాతో ఊహించని రీతిలో టాప్ స్థాయికి చేరింది.ఆ తరువాత స్పేస్ ఎక్స్ తో ప్రపంచంలోనే అపర కుబేరుల్లో ఆయన కూడా ఒకరుగా పేరు సంపాదించుకున్నారు.
అలాంటి ఎలన్ మస్క్ కు సొంత ఇల్లు లేకపోవడం ఏంటి అని ప్రజలందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.కానీ ఇదే నిజం అని ఎలన్ మస్క్ అంటున్నారు.
సొంత ఇళ్లు లేని తాను స్నేహితుల ఇళ్లల్లోనే ఉంటానని తాజాగా టెడ్ నిర్వహించిన ఇంటర్వ్యూలో మోడరేటర్ అండర్సన్ తో చెప్పుకోచ్చాడు.అలాగే ఆయన గురించిన మరెన్నో ఆసక్తికర విషయాలను ప్రపంచానికి తెలియచేసాడు.
టెస్లా ఇంజినీరింగ్ పనులు ఎక్కువగా జరిగే బే ఏరియాకు ఎలన్ తరచుగా వెళ్తుంటానని తెలిపారు.అలా ఆ ప్రాంతానికి వెళ్లిన సందర్భాల్లో తన ఫస్నేహితుల ఇళ్లలో ఉండే స్పేర్ బెండ్ రూమ్ లలోనే ఉండేవాడినని చెప్పుకొచ్చారు.
అలాగే ఎలన్ మస్క్ ఎక్కువగా డబ్బులు కూడా ఖర్చు పెట్టేవారు కాదట. ఖర్చులు కూడా చాలా తక్కువని ఆయన తెలిపారు అలాగే ఇప్పటివరకు ఆయనకు సొంతంగా ఒక్క లగ్జరి యాచ్ కూడా లేదని ఎలన్ మస్క్ వెల్లడించారు.అలాగే తనకంటూ ఏదైనా విలువైనది ఉందంటే అది ఒక్క విమానమేనని ఆయన వివరించారు.
ఆ విమానమే లేకపోతే తాను పనులు చేసుకోవడం కుదరదని, దాని వలనే సమయం కూడా ఆదా అవుతోందని పేర్కొన్నారు.అంత ఆస్థి ఉండి కూడా సింపుల్ లైఫ్ ను లీడ్ చేయడం అంటే చాలా గ్రేట్ కదా అని నేటిజన్లు ఎలన్ మస్క్ ను పొగుడుతున్నారు.!.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy