ఇదేందయ్యా ఇది: జైలులో ఉండి నలుగురికి తండ్రి అయిన వ్యక్తి.. అది ఎలా సాధ్యం అంటే..?!

స్త్రీ గర్భం దాల్చాలంటే తప్పకుండా పురుషుడు కావలిసిందే.స్త్రీ,పురుషుల కలయిక అనేది లేనిదే బిడ్డకు జన్మ నివ్వడం అనేది కష్టం.

కానీ ఒక ఖైదీ మాత్రం 15 ఏళ్లుగా జైలులోనే మగ్గిపోతున్నాడు.అయినా కూడా తన భార్య నలుగురు పిల్లలకు జన్మ నిచ్చింది.

Is This It A Man Who Was In Prison And The Father Of Four How Is That Possible,

అలా అని తన భార్య తప్పు చేసింది అని భర్త చెప్పడం లేదు.ఆ పిల్లలకు తండ్రిని నేనే అంటున్నాడు.

మరి అదెలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా? ఈ సంఘటన గురించి తెలిస్తే మీరు షాక్ అవ్వడం మాత్రం గ్యారంటీ.అదే కదా మ్యాజిక్కు అంటే.

Advertisement

ఆ మ్యాజిక్ ఏంటో మీరే తెలుసుకోండి.వివరాల్లోకి వెళితే పాలస్తీనాకు చెందిన రాఫత్ అల్ కారావి అనే వ్యక్తి గతం 15 ఏళ్లు ఇజ్రాయెల్​లోని జైలులో శిక్ష అనుభవించాడు.

అతను ఇజ్రాయెల్​కు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో ప్రధాన నిందితుడిగా తేలడంతో అతడిని 2006లో అరెస్టు చేసి 15 ఏళ్ల శిక్ష విధించారు.ఇలా శిక్ష అనుభవిస్తున్న కాలంలోనే ఆ వ్యక్తి నలుగురు పిల్లలకు జన్మనిచ్చాడని ఆరోపణలు వచ్చాయి.

అది ఎలా సాధ్యమనదో అనే విషయాన్ని జైలు నుంచి విడుదలైన తర్వాత ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు రాఫత్.బిడ్డ పుట్టాలంటే ఆడ, మగ శృంగారంలో పాల్గొంటేనే పుడతారని అనుకోవడం పొరపాటు.

సెక్స్ లో పాల్గొనకపోయినా పురుషుడి వీర్యం ఉంటే చాలు అని గుర్తు చేసాడు.అలాగే జైలులో ఉన్నప్పుడు ఆలూ చిప్స్ బ్యాగులలో వీర్యాన్ని ఉంచి బయటకు పంపించేవాడని తెలిపాడు.

30 ఏళ్లకే ముసలివారిలా కనిపిస్తున్నారా.. యంగ్ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం ఇలా చేయండి!

కుటుంబ సభ్యులు తనను చూడటానికి వచ్చినప్పుడు వారికి వీర్యాన్ని ఉంచిన చిప్స్ ప్యాకెట్ ను ఇచ్చేవాడని తెలిపాడు.జైలు అధికారులు ఖైదీల పేర్లను పిలిచే ముందు వీర్యాన్ని ప్యాకెట్​లో కట్టి, ఆ వీర్యం ఉన్న చిప్స్ ప్యాకెట్​పై ఒక గుర్తు వేసేవాడట అలా ఆ చిప్స్ ప్యాకెట్లను జైలు అధికారులకు అనుమానం రాకుండా సీల్ చేస్తాడు.

Advertisement

అయితే ఇలా వీర్యం ఇచ్చే విషయాన్నీ అంతకుముందు ఓసారి తనను కలవడానికి వచ్చినప్పుడే కుటుంబ సభ్యులకు చెప్పేవాడట.అలా ఆ వీర్యం ఉన్న ప్యాకెట్ ను తీసుకొని కుటుంబ సభ్యులు డైరెక్ట్ గా ఫర్టిలిటీ సెంటర్ కు వెళ్తారు అని రాఫత్ వివరించాడు.

అలా నలుగురు పిల్లలకు జన్మ నిచ్చాడని రాఫత్ చెప్పుకొచ్చాడు.అలాగే పాలస్తినాలో ఉండే ఖైదీలు సంతానం కోసం ఈ పద్ధతిని అనుసరిస్తున్నారని అక్కడి పత్రికలో వార్తలు కూడా వచ్చాయి.

సుమారు వంద మంది చిన్నారులు ఇలా జన్మించి ఉంటారని పాలస్తీనా మీడియా అంచనా కూడా వేసింది.అయితే రాఫత్ చెప్పిన వివరణ ప్రకారం అలా చిప్స్ ప్యాకెట్​లో వీర్యాన్ని తీసుకుని వెళ్లడంపై వైద్య నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే పురుషుల వీర్యంలోని శుక్ర కణాలు శరీరం బయట సెకన్లు లేదా కొన్ని నిమిషాల పాటు మాత్రమే జీవిస్తాయి.మరి రాఫత్ వీర్యం జైలులో నుంచి బయటకు తీసుకురావడం ఆ తరువాత ఆస్పత్రిలో చికిత్స చేయించుకునేంత వరకు ఎలా పాడవకుండా సజీవంగా ఉందనే ప్రశ్నపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

తాజా వార్తలు