పురంధేశ్వరికి లక్కీ ఛాన్స్ రాబోతోందా ?

ఏపీ నుంచి బీజేపీ కీలక నాయకురాలిగా మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఉన్నారు.

కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో కేంద్ర మత్రిగా కీలక బాధ్యతలను నిర్వర్తించిన  ఆమె ఆ తరువాత కాంగ్రెస్ పరిస్థితి ఏపీలో ఏ మాత్రం లేకపోవడం తదితర కారణాలతో ఆ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు.

బీజేపీలోని గుర్తింపు పొందడంతో పాటు, జాతీయ స్థాయిలో నామినేటెడ్ పదవి ని ఆమె దక్కించుకున్నారు.గత కొంతకాలంగా ఏపీలో అమరావతి వ్యవహారంతో పాటు, మరికొన్ని అంశాలపై బిజెపి పోరాటం చేస్తోంది.

వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు మొదట్లో ఆమె మొహమాట పడేవారు.దీనికి కారణం ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసిపి లో యాక్టివ్ గా ఉండటమే.

అయితే ఆయన చాలా కాలంగా వైసిపి తో సంబంధం లేనట్టుగా వివరిస్తున్నారు.దీంతో పురందరేశ్వరి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ బీజేపీ ప్రభావం పెరిగేలా చేస్తున్నారు.

Advertisement

ఈ వ్యవహారం ఇలా ఉంటే ఏపీలో బీజేపీ పరిస్థితి ఆశించినంత స్థాయిలో లేదు.తెలంగాణ బీజేపీ తో పోలిస్తే ఏపీలో బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం, రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభావం పెద్దగా ఉండే అవకాశం లేకపోవడం, ఇలా అనేక కారణాలతో బీజేపీ అధిష్టానం ఏపీలో పరిస్థితి మార్చాలనే నిర్ణయానికి వచ్చేసింది.

బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు మొదట్లో ఫర్వాలేదు అన్నట్టుగా వ్యవహరించినా.ఆ తరువాత ఆయన ప్రభావం ఏమాత్రం కనిపించకపోవడం, గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం తదితర కారణాలతో ఆయనను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి వార్తలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి.

ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను పురంధరేశ్వరికి అప్పగిస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది.

కమ్మ సామాజిక వర్గానికి చెందిన పురందరేశ్వరి బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపడితే టిడిపిలో కీలకంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం అసంతృప్త నేతలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరతారని, బలమైన సామాజిక వర్గం అండదండలు బిజెపికి ఉంటాయని, వీర్రాజు తో పోలిస్తే పురంధరేశ్వరి యాక్టివ్ గా ఉంటూ బిజెపి ప్రభావాన్ని పెంచగలరని బిజెపి అధిష్టానం పెద్దలు బలంగా నమ్ముతున్నారట.2024 ఎన్నికల్లో ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా ఉండబోతోంది.వైసిపి, టిడిపి, జనసేన, బిజెపి ల మధ్య పోరు హోరాహోరీగా ఉండబోతోంది.

5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide
5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide

రాబోయే ఎన్నికల్లో బిజెపి, జనసేన  కలిసి పోటీ చేసే అవకాశం కూడా  కనిపించకపోవడంతో ఎన్నికలకు ముందే పురంధరేశ్వరికి ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తారనే ప్రచారం ఊపందుకుంది.చాలా కాలం నుంచి ఏపీ బీజేపీ అధ్యక్షుడిని మార్చుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు పురంధరేశ్వరి పేరు తెరపైకి వచ్చింది.

Advertisement