Sandeep Vanga Prabhas : ప్రభాస్ విషయం లో సందీప్ రెడ్డి వంగ కొంచెం డిస్సాపాయింట్ అవుతున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి లాంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకొని తెలుగు సినిమా చరిత్రని తిరగరాసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ.

( Sandeep Reddy Vanga ) ఈయన చేసిన అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా సినిమా పాటర్న్ మొత్తం మారిపోయింది.

ఒక సినిమా అంటే ఎలా ఉండాలి.దర్శకుడు ఎలా తీయాలి, దాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దగ్గర నుంచి ప్రతి మూమెంట్లో మార్పులు చేశాడు.

అలాగే ఒక సినిమా స్టాండర్డ్ ఎలా ఉండాలో కూడా డిసైడ్ చేశాడు.సందీప్ రెడ్డి రంగా ఎప్పుడైతే అర్జున్ రెడ్డి సినిమా( Arjun Reddy ) తీసాడో అప్పటి నుంచి సినిమాలు తీసే డైరెక్టర్లు గాని, చూసే ప్రేక్షకుల టేస్ట్ గానీ మారిపోయింది.

ఇక ఇది ఇలా ఉంటే గత సంవత్సరం అనిమల్ సినిమాతో వచ్చి భారీ సక్సెస్ ని అందుకున్నాడు.ఇక ఈ సినిమాతో దాదాపు 800 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టడమే కాకుండా పాన్ ఇండియా లో టాప్ డైరెక్టర్ గా కూడా ఎదిగాడు.

Advertisement
Is Sandeep Reddy Vanga Getting A Bit Disappointed In Prabhas Matter-Sandeep Van

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రబాస్ తో( Prabhas ) స్పిరిట్ అనే సినిమా చేయబోతున్నాడు.

Is Sandeep Reddy Vanga Getting A Bit Disappointed In Prabhas Matter

ఇప్పటికే ప్రభాస్ రాజసాబ్, కల్కి సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ రెండు సినిమాలు ముగిసిన వెంటనే స్పిరిట్ సినిమాలో( Spirit Movie ) పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇకనిప్పుడు ఆ సినిమాకు సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్ ని చేస్తున్నాడు.ఇక ఇది ఇలా ఉంటే సందీప్ ఒక విషయంలో తీవ్రంగా బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది.

అది ఏంటి అంటే స్పిరిట్ సినిమా షూటింగ్ మరికొద్ది రోజులు లేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది.ఎందుకంటే కల్కి సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే స్పిరిట్ ని స్టార్ట్ చేద్దాం అనుకున్నారట.

Is Sandeep Reddy Vanga Getting A Bit Disappointed In Prabhas Matter

కానీ రాజాసాబ్ షూటింగ్ మరి కొంత బ్యాలెన్స్ ఉండడంతో ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తయిన తర్వాత స్పిరిట్ సినిమాని స్టార్ట్ చేయాలని ప్రభాస్ చూస్తున్నారట.అంటే అక్టోబర్ లో స్టార్ట్ అవ్వాల్సిన స్పిరిట్ సినిమా దాదాపు ఈ సంవత్సరం ఎండింగ్ లో స్టార్ట్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక సందీప్ మాత్రం చాలా తొందరగా ఈ సినిమాను స్టార్ట్ చేసి, తొందరగా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలని చూస్తుండగా ప్రభాస్ మాత్రం ఇలా లేట్ చేయడం కొంత వరకు సందీప్ కి ఇబ్బంది కలిగిస్తుందట.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే
Advertisement

తాజా వార్తలు