రాజమౌళి కొత్త టార్గెట్ ను సెట్ చేస్తున్నాడా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) చాలామంది హీరోలు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నారు.

ఇక మహేష్ బాబు లాంటి నటుడు సైతం ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది.

యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి( Rajamouli ) ని మించిన దర్శకుడు లేడు అనేది వాస్తవం.మరి ఇప్పుడు ఆయన మహేష్ బాబుతో ( Mahesh Babu )చేస్తున్న సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు.

ఇక ఎప్పుడైతే ఆయన ఈ సినిమాని అనౌన్స్ చేశాడో అప్పటినుంచి సినిమా మీద భారీ హైప్ అయితే క్రియేట్ అవుతుంది.ఇక ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ ఏంటి అనే విషయంలో రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఏ మాత్రం స్టోరీని బయటికి లీక్ చేయకుండా ఉంచుతున్నాడు.

కారణం ఏదైనా ఈ సినిమా 3000 కోట్లకు పైన కలెక్షన్లు రాబడుతుంది అంటూ సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.మరోసారి వరల్డ్ లో ఉన్న ప్రేక్షకులు సైతం అతని స్టామినాను తెలుసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు.

Is Rajamouli Setting A New Target , Telugu Film Industry , Rajamouli , Mahesh Ba
Advertisement
Is Rajamouli Setting A New Target , Telugu Film Industry , Rajamouli , Mahesh Ba

మరి రాజమౌళి సైతం ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.ఇక ఆయన చేసిన ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ ని సాధిస్తుందనేది వాస్తవం.మరి ఇకమీదట ఆయన ఎలాంటి సినిమాలు చేస్తాడు తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది.

ఈ సినిమాతో ఇండస్ట్రీ లో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేయడమే కాకుండా కొత్త రికార్డులను క్రియేట్ చేసి మరెవరు ఆ రికార్డులను బ్రేక్ చేయని రేంజ్ లో నిలుపబోతున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు