పవన్ కు తెలంగాణ ఎఫెక్ట్ గట్టిగానే తగులుతోందా ?

ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన( Janasena )కు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే.

ఆ పార్టీ పోటీ చేసిన ఏడు స్థానాల్లో కూడా మినిమమ్ ఓటు శాతం నమోదు కానీ పరిస్థితి.

కొల్లాపూర్ నియోజక వర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సోషల్ మీడియా ఫేమ్ బర్రెలక్క కు పోల్ అయిన ఓట్లు కూడా జనసేన అభ్యర్థిని నమోదు కాకపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే.ఈ పరిణామలే పవన్ ను ఏపీలో ఇబ్బంది పెట్టేలా కనిపిస్తున్నాయి.

తెలంగాణలో జనసేన పార్టీకి జరిగిన పరాభవాన్ని ప్రధాన విమర్శగా మలచుకొని వైసీపీ నేతలు వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు.

Is Pawan In Trouble Even In Ap , Janasena ,pawan Kalyan , Telangana Elections,

పవన్( Pawan kalyan ) ప్రజలు పొలిటీషియన్ గా గుర్తించడం లేదని, ఆయనను సినీ హీరోగానే ప్రజలు చూస్తున్నారంటూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.రాబోయే ఏపీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీకి తెలంగాణ ఫలితలే ఎదురవుతాయని చెబుతున్నారు.దీంతో వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు జనసేన నేతలు ధీటుగా సమాధానం ఇవ్వలేక పోతున్నారు.

Advertisement
Is Pawan In Trouble Even In AP , Janasena ,Pawan Kalyan , Telangana Elections,

అసలే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీని ప్రజలు ఏ స్థాయిలో తిరస్కరించారో అందరి కి తెలిసిందే.అధినేత పవన్ కూడా పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పరిస్థితి.

ఇక ఇటీవల తెలంగాణలోనూ పోటీ చేసిన స్థానాలన్నిటిలో ఓటమే ఎదురైంది.

Is Pawan In Trouble Even In Ap , Janasena ,pawan Kalyan , Telangana Elections,

దాంతో ఏపీలో ఏపీ ఎన్నికల్లో జనసేనకు ఎలాంటి ఫలితాలు వస్తాయో అని భయం ఆ పార్టీ నేతలను గట్టిగానే వెంటాడుతోంది.పైగా వైసీపీ నేతలు చేస్తున్న వ్యంగ్య విమర్శలు కూడా జనసేన పార్టీపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ వాదులు చెబుతున్నారు.ఇంకా టీడీపీ( TDP )తో పొత్తులో ఉన్న జనసేన పార్టీకి సీట్ల కేటాయింపులో కూడా తెలంగాణ ఎఫెక్ట్ గట్టిగానే కనిపించే అవకాశం ఉంది.

తెలంగాణ( Telangana )లో మొదట 32 స్థానాల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ ప్రయత్నించింది.కానీ  అనూహ్యంగా బీజేపీతో కలవడం వల్ల కేవలం 7 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

ఆ ఏడు సీట్లలో కూడా జనసేన ప్రభావం చూపక పోవడంతో టీడీపీ కూడా జనసేనకు తక్కువ సిట్లే కేటాయించే అవకాశం లేకపోలేదు.మొత్తానికి జనసేన పై తెలంగాణ ఎఫెక్ట్ గట్టిగానే పడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు