ఏపీలో బిజెపి జనసేన పార్టీల పొత్తుకు సంబంధించి ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి.
రెండు పార్టీలు అధికారికంగా పొత్తు పెట్టుకున్నా, ఎవరికి వారే విడివిడిగా కార్యక్రమాలు చేపట్టడం, పొత్తు ఉన్నా లేనట్టుగానే వ్యవహరిస్తుండడం, బిజెపి అగ్రనేతలు ఏపీలో పర్యటించినా పవన్ హాజరు కాకపోవడం, అలాగే బిజెపి అగ్రనేతలు పవన్ కు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఇవన్నీ రెండు పార్టీల మధ్య పొత్తు రద్దయ్యేందుకు సంకేతాలు గానే అభిప్రాయపడుతున్నారు.
జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాలనే ఆలోచనతో ఉన్నట్లుగా చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. ఇప్పటికి ఇప్పుడు కాకపోయినా, ఎన్నికల సమయంలో తప్పకుండా జనసేన , టిడిపి కలిసి పోటీ చేస్తాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అయితే ఈ విషయంలో పవన్ అభిప్రాయం ఏ విధంగా ఉందనేది ఎవరికి అందు పట్టడం లేదు.అయితే బిజెపి కూడా జనసేనతో పొత్తు రద్దు చేసుకునే ఆలోచనలో లేదు.
తమకు అంతంత మాత్రంగానే బలం ఉండడంతో జనసేన సహకారంతో ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలను దర్శించుకోవాలని బిజెపి చూస్తోంది.
అయితే ఇదే రకమైన అభిప్రాయంతో పవన్ కూడా ఉన్నారట.2024 ఎన్నికల్లో కేంద్రంలో మళ్లీ బిజెపి అధికారంలోకి వస్తుందని వివిధ సర్వేలు బయటకు రావడం , జాతీయస్థాయిలో కాంగ్రెస్ బలహీనం అవడం ఇవన్నీ లెక్కలు వేసుకుంటున్న పవన్ బిజెపితో పొత్తు కొనసాగిస్తేనే 2024 ఎన్నికల తర్వాత కూడా జనసేనకు మేలు జరుగుతుందని ,లేకపోతే అనేక రకాలుగా రాజకీయ ఇబ్బందులు ఎదుర్కోవాలనే భయం పవన్ లో ఎక్కువగా కనిపిస్తోంది.అయితే టిడిపిని కూడా తమ పొత్తులో భాగస్వామ్యం చేస్తేనే మంచింది అనేది పవన్ అభిప్రాయంగా కనిపిస్తోంది.
ఈ విషయంలో బీజేపీ నేతలు ఒప్పుకోకపోయినా తాము మాత్రం బీజేపీ కి దూరం కాకూడదు అనే లెక్కల్లో పవన్ ఉన్నారట.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy