ప్రెగ్నెన్సీ టైంలో మెంతులు తీసుకుంటే ప్రమాదమా.. నిపుణులు ఏమంటున్నారు?

మాతృత్వం అనేది ఎంత మ‌ధుర‌మైన‌దో మాట‌ల్లో వ‌ర్ణించ‌లేము.అందుకే పెళ్లి అయిన ప్రతి మహిళ మాతృత్వం కోసం తెగ ఆరాట పడుతుంటుంది.

ఇక కోరుకున్నట్టుగానే ప్రెగ్నెంట్ అయితే ఇక వారి ఆనందానికి అవధులు ఉండవు.అయితే మామూలు సమయంతో పోలిస్తే ప్రెగ్నెన్సీ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఎన్నో ఆహార నియమాలు పాటించాలి.ఆ సమయంలో కొన్ని కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలని పెద్దలు చెబుతున్నారు.

అటువంటి వాటిలో మెంతులు ఒకటి.అస‌లు గ‌ర్భిణీలు మెంతులు ఎందుకు తీసుకోకూడ‌దు.? ప్రెగ్నెన్సీ టైం లో మెంతులు తీసుకుంటే ప్రమాదమా.? అంటే నిపుణులు అవున‌నే చెబుతున్నారు.అయితే మితంగా తీసుకుంటే మెంతులు వల్ల ఎలాంటి హాని జరగదు.

Advertisement

కానీ అధిక మొత్తంలో మెంతులు కనుక వాడితే గర్భస్రావానికి దారితీసే ప్రమాదం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

అలాగే ప్రెగ్నెన్సీ టైంలో అధిక మొత్తంలో మెంతులు తీసుకోవడం వల్ల శరీరం యొక్క హార్మోన్ల సమతుల్యత దెబ్బ తింటుంది.దీని కారణంగా థైరాయిడ్ తో స‌హా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఆ టైంలో మెంతులు తీసుకోవడం వల్ల వాంతులు, వికారం వంటి సమస్యను తరచూ ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఒక్కోసారి గర్భిణీల్లో మెంతులు కడుపు ఉబ్బరం, అతిసారం వంటి సమస్యలను తెచ్చిపెడ‌తాయి.

అంతేకాదు, ప్రెగ్నెన్సీ సమయంలో మెంతుల‌కు అధిక మొత్తంలో తీసుకోవ‌డం వ‌ల్ల మీరు ఉపయోగించే మందుల ప్రభావాలు త‌గ్గిపోయే అవకాశాలు ఉంటాయి.మెంతుల‌ను ఓవ‌ర్ గా తీసుకుంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గురక, తరచూ ముక్కు కారడం వంటి సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి.కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు పొరపాటున కూడా మెంతులను అధిక మొత్తంలో తీసుకోవద్దు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 5, ఆదివారం, జ్యేష్ఠ మాసం , 2022

అలా అని పూర్తిగా మానేయాలని కూడా చెప్పడం లేదు.మితంగా మెంతులను తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు అని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు