అరటి పండును పరుగడపున తింటే ప్రమాదమా..?

చాలామంది రోజు అరటిపండు( Banana ) తింటూ ఉంటారు.కొంతమందికి అరటిపండు ఏ సమయంలో తీసుకోవాలో తెలిసి ఉండదు.

అయితే అరటిపండును ఏ సమయంలో తినాలో, తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.కొన్ని పండ్లు సీజన్ కు తగ్గట్లు మార్కెట్లో వస్తూ ఉంటాయి.

కానీ అరటిపండు మాత్రం ఎప్పుడైనా మనకు అందుబాటులో ఉంటాయి.అంతేకాకుండా వీటి ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది.

ఇది రుచికరంగా ఉండడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.అందుకే చాలామంది అరటిపండును తినడానికి ఇష్టపడతారు.

Advertisement
Is It Dangerous To Eat Bananas On The Run, Banana, Fiber, Antioxidants, Potassi

ఇక కొంతమంది వీటిని వేరుగా తింటే మరి కొంతమంది తమ ఆహారంలో మిక్స్ చేసుకొని తింటారు.

Is It Dangerous To Eat Bananas On The Run, Banana, Fiber, Antioxidants, Potassi

శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు వీటిలో ఉన్నాయి.అరటి పండులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు( Antioxidants )పొటాషియం, మెగ్నీషియం లాంటి పదార్థాలు ఉన్నాయి.అరటిపండును తినడం వలన బరువు తగ్గడం, గుండె ఆరోగ్యం( heart health )జీవ క్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

అయితే అరటిపండును ఏ సమయంలో తినాలి? అన్న అనుమానాలు చాలామందిలో ఉంటాయి.అరటిపండును ఉదయం లేదా సాయంత్రం తీసుకోవడం మంచిది.

రాత్రిపూట జీవక్రియ అత్యల్పంగా ఉంటుంది.ఇక అరటిపండులో ఉండే ట్రిప్టోపాన్ అనే అమైనో ఆమ్లం నిద్రను నియంత్రించే సెరోటోనిన్‌ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది.

Is It Dangerous To Eat Bananas On The Run, Banana, Fiber, Antioxidants, Potassi
వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

అందుకే రాత్రి తింటే శ్లేష్మం ఉత్పత్తిని కూడా పెంచుతుంది.అయితే దగ్గు( cough ) ఉన్నవారు రాత్రిపూట అరటిపండును తీసుకోకూడదు.అరటిపండును ఉదయం లేదా సాయంత్రం తీసుకుంటేనే ఎక్కువ లాభాలు కలుగుతాయి.

Advertisement

అయితే కొంతమంది పరగడుపున లేదా ఎలాంటి ఆహారం తీసుకోకముందు అరటిపండును తీసుకుంటారు.అలా తినడం అస్సలు మంచిది కాదు.

ఇవి ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి.కాబట్టి ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం వలన జీర్ణ క్రియపై ఒత్తిడి కలుగుతుంది.

అలాగే ప్రేగులకు చికాకు పెడతాయి.అందుకే వీటిని ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం మంచిది.

తాజా వార్తలు