వెంకటేష్ తో మల్టీ స్టార్రర్ చెయ్యడానికి ఇష్టపడని ఏకైక హీరో అతనేనా..? ఇంత పగ ఎందుకో!

టాలీవుడ్ సీనియర్ హీరోలు, అంటే మన ముందు తరం హీరోలలో అత్యధిక శాతం సూపర్ హిట్స్ ఉన్న నటుడు విక్టరీ వెంకటేష్.

( Venkatesh ) అందుకే ఆయనని అందరూ విక్టరీ వెంకటేష్ అని పిలుస్తారు.

కామెడీ, సెంటిమెంట్, యాక్షన్, ఫ్యాక్షన్ , లవ్ స్టోరీస్, ఫ్యామిలీ, మాస్ ఇలా టాలీవుడ్ లో ఎన్ని జానర్స్ ఉన్నాయో అన్నీ జానర్స్ లో సూపర్ హిట్స్ కొట్టిన ఏకైక హీరో ఆయన.ఒక్క పౌరాణికం మరియు జానపదం వైపు పోలేదు అంతే.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో వెంకటేష్ ఏర్పాటు చేసుకున్న బ్రాండ్ ఇమేజి సాధారమైనది కాదు.

ఎవరికైనా ఫ్యామిలీ ఆడియన్స్ లో ఫాలోయింగ్ వస్తే,వెంకటేష్ తో పోల్చి చూసుకుంటారు.ఆ స్థాయి బెంచ్ మార్క్ ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన.అంతే కాదు నేటి తరం హీరోలు అయినా, నిన్నటి తరం హీరోలైన వెంకటేష్ తో కలిసి సినిమా చెయ్యడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు.

Is He The Only Hero Who Does Not Want To Do A Multi Starrer With Venkatesh Why

ఎందుకంటే వెంకటేష్ అందరితో ఎంతో స్నేహం గా ఉంటాడు కాబట్టి.కానీ ఒక్క హీరో మాత్రం వెంకటేష్ తో సినిమా చెయ్యడానికి ఆసక్తి చూపలేదట.ఆ హీరో మరెవరో కాదు, అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ).వరుసకు వీళ్లిద్దరు బావ బామ్మర్దులు అవుతారు.ఎందుకంటే వెంకటేష్ సోదరి లక్ష్మి ని నాగార్జున పెళ్లి చేసుకున్నాడు కాబట్టి.

Advertisement
Is He The Only Hero Who Does Not Want To Do A Multi Starrer With Venkatesh Why

అయితే కొన్ని కారణాల చేత నాగార్జున లక్ష్మి కి విడాకులు ఇవ్వాల్సి వచ్చింది.అప్పటి నుండి వెంకటేష్ మరియు నాగార్జున మధ్య మాటలు లేవు.

మధ్యలో వీళ్లిద్దరు కలిసి మూడు మల్టీస్టార్రర్ సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చిందట.నాగార్జున మరియు సుమంత్ కాంబినేషన్ లో వచ్చిన స్నేహమంటే ఇదేరా( Snehamante Idera ) చిత్రం ముందుగా వెంకటేష్ మరియు నాగార్జున చెయ్యాల్సింది.

వెంకటేష్ నటించడానికి సిద్ధం గానే ఉన్నప్పటికీ,నాగార్జున మాత్రం ఇష్టం చూపలేదు.చివరికి సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న తన కుటుంబ సభ్యుడు సుమంత్ తో కలిసి చేసాడు.

Is He The Only Hero Who Does Not Want To Do A Multi Starrer With Venkatesh Why

ఆ చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ అయ్యింది.ఇక ఆ తర్వాత బాలీవుడ్ సూపర్ హిట్ హౌస్ ఫుల్ చిత్రాన్ని నాగార్జున మరియు వెంకటేష్ కాంబినేషన్ లో చెయ్యాలని పలువురు నిర్మాతలు ముందుకు వచ్చారు.కానీ నాగార్జున ఇందుకు కూడా ఒప్పుకోలేదు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

ఇప్పటికీ వీళ్లిద్దరు కలిసి మల్టీస్టార్రర్ సినిమాలు చేసే స్కోప్ చాలా ఉంది, కానీ చెయ్యరు.సీనియర్ హీరోలలో ఒకే రేంజ్ మార్కెట్ ఉన్న ఈ ఇద్దరు కలిసి సినిమాలు చేస్తే కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది, స్టార్ హీరో రేంజ్ వసూళ్లు వస్తాయి.

Advertisement

వీళ్ళిద్దరిని కలిపే డైరెక్టర్ వస్తాడో రాడో చూడాలి.

తాజా వార్తలు