ఏపీ బీజేపీ కి కొత్త అధ్యక్షుడు ఆయనేనా ? 

ఏపీలో క్షేత్రస్థాయి నుంచి బిజెపిని బలోపేతం చేసే విషయంపై ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది.

దీనిలో భాగంగానే పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉండే విధంగా కసరత్త మొదలుపెట్టింది.

ఈ మేరకు పార్టీ పదవులలోను ప్రక్షాళన చేపట్టి,  బీజేపీని ఏపీలో పరుగులు పెట్టించాలని భావిస్తుంది.ప్రస్తుతం టిడిపి,  జనసేన పార్టీలతో పొత్తు కొనసాగిస్తూనే సొంతంగా బలపడే విషయం పైన బిజెపి అధిష్టానం పెద్దలుఫోకస్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందరేశ్వరి ( Daggubati Purandeswari )ఉన్నారు.అయితే ఆమె స్థానంలో కొత్తవారికి ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలనే ఆలోచనతో బీజేపీ అధిష్టానం ఉందట.

 పురంధరేశ్వరి కి జాతీయ స్థాయిలో కీలక పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఈ మేరకు కొత్త అధ్యక్షుడి ఎంపికపైన అభిప్రాయ సేకరణ చేశారట.ఈ మేరకు ఇద్దరి పేర్లను పరిశీలనలోకి తీసుకున్నట్లు సమాచారం .త్వరలోనే తెలంగాణ , ఏపీకి కొత్త అధ్యక్షులను నియమించనున్నారట.ఏపీలో జరిగిన ఎన్నికల్లో బిజెపి మూడు ఎంపీ , 8 అసెంబ్లీ స్థానాలను గెల్చుకుంది .నరసాపురం నుంచి ఎంపీగా గెలిచిన బిజెపి సీనియర్ నేత భూపతి రాజు శ్రీనివాస్ వర్మ( Bhupathi Raju Srinivasa Varma ) కు , కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చారు.ఇక పార్టీ అధ్యక్షులు, బాధ్యతలను కాపు, రెడ్డి ,బిసి సామాజిక వర్గాల్లో ఏ వర్గానికి పదవి ఇవ్వాలనే విషయం పైన చర్చ జరుగుతోందట.

Advertisement

రాయలసీమలో బిజెపి బలపడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న బీజేపీ అధిష్టానం,  అదే ప్రాంతానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి బిజెపి అధ్యక్ష పదవి ఇస్తే కలిసి వస్తుందనే అంచనాతో ఉందట.

ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి( Kiran Kumar Reddy ) రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.రాష్ట్ర వ్యాప్తంగా కిరణ్ కుమార్ రెడ్డికి విస్తృత పరిచయాలు ఉన్న నేపథ్యంలో ,బిజెపిలో చేరికల విషయంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తారని అంచనా వేస్తున్నారు.పురంధరేశ్వరి తో ఒక వర్గం,  కొంతమంది నేతలకు మధ్య విభేదాలు ఉన్నట్లు గుర్తించిన బీజేపీ అధిష్టానం త్వరలోనే కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు ప్లాన్ చేస్తోందట.

Advertisement

తాజా వార్తలు