ఆ విష‌యంలో చంద్ర‌బాబు నిర్ణ‌యం ఆల‌స్య‌మ‌యిందా.. వైసీపీకే ప్ల‌స్ అవుతుందా..?

ప్ర‌స్తుతం ఏపీలో విశాఖ ఉక్కు ప్ర‌యివేటీక‌ర‌ణ‌పై ఎంత పెద్ద‌గా చ‌ర్చ సాగుతుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

ఎందుకంటే కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ప్ప‌టి నుంచి ఈ ఉద్య‌మం పెద్ద ఎత్తున సాగుతోంది.

అయితే ఈ విష‌యంలో మొద‌టి నుంచి టీడీపీ పెద్ద‌గా యాక్ష‌న్ తీసుకుంటున్నట్టు క‌న‌పించ‌ట్లేదు.ఇక వైసీపీ అయితే దీనిపై పెద్ద‌గానే కొట్లాడుతోంది.

ఏపీ ప్ర‌యోజ‌నాలే త‌న‌కు ముఖ్యం అన్న‌ట్టు స్టేట్ మెంట్లు కూడా ఇస్తోంది.దీని కోసం ఎవ‌రితో అయినా కొట్లాడుతామంటూ ప్ర‌క‌టిస్తోంది.

ఇక ఇప్పుడు పార్లమెంటులో కూడా దీనిపై పోరాడుతున్నారు వైసీపీ ఎంపీలు.అయితే ఇప్పుడు ఇంత జ‌రిగాక టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేందుకు కేంద్రం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌కు వ్యతిరేకంగా త‌మ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేయటానికి కూడా సిద్ధ‌మే అంటూ స్టేట్ మెంట్ ఇస్తున్నారు.

Advertisement
Is Chandrababu Decision Late In That Matter Will Ycp Be A Plus, Chandrababu, Ycp

ఏకంగా ఈ విష‌యాన్ని వివ‌రిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితికి కన్వీనర్ గా ప‌నిచేస్తున్న నేత‌కు ఈ మేర‌కు లేఖ కూడా చంద్రబాబు రాశారు.అయితే ఇన్ని రోజులు ఈ విధ‌మైన చ‌ర్య‌లు ఎందుకు తీసుకోలేద‌నే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.

ఇలా లేఖ‌ల‌తో చెప్పే బ‌దులు చేత‌ల్లో చేసి చూపిస్తే ఇంకా బాగుండేదంటూ వార్తలు వ‌స్తున్నాయి.

Is Chandrababu Decision Late In That Matter Will Ycp Be A Plus, Chandrababu, Ycp

ఈ విష‌యంపై ఇప్ప‌టికే రాజీనామా చేసిన త‌మ ఎమ్మెల్యేలాగే మిగ‌తా మందితో కూడా రాజీనామాలు చేయించి ఉంటే టీడీపీపై ప్ర‌జ‌ల్లో మంచి ఇమేజ్ ఏర్ప‌డి ఉండేద‌ని అంతా అనుకుంటున్నారు.ఇక దీనిపై ఇప్ప‌టికే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి స్పష్టంగా క్లారిటీ ఇస్తూ నూరుశాతం కంపెనీని అమ్మ‌డ‌మే నంటూ కూడా ప్రకటించారు.అంటే ఈ విష‌యంలో వైసీసీ, కేంద్రం కుమ్మ‌క్కై ఈ విధంగా కంపెనీనీఇ అమ్ముతోందంటూ ఇన్ని రోజులు చంద్ర‌బాబు ఎందుకు రాజ‌కీయాలు చేయ‌లేద‌ని త‌మ్ముళ్లు భావిస్తున్నారంట‌.

ఏదేమైనా ఇప్పుడు అంతా అయిపోయాక ఇలాంటివి చేస్తే ఏం లాభం అని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు టీడీపీ కార్య‌క‌ర్త‌లు.

హీరో హీరోయిన్స్ గా నటించి అన్నాచెల్లెళ్లుగా చేసిన టాలీవుడ్ యాక్టర్స్
Advertisement

తాజా వార్తలు