మధ్యాహ్నం కునుకు మంచిదా? చెడ్డదా? తప్పకుండా తెలుసుకోండి!

మధ్యాహ్నం భోజనం( Afternoon Nap ) చేసిన వెంటనే విపరీతమైన నిద్ర వచ్చేస్తుంటుంది.దీంతో చాలా మంది ఒక కునుకు తీస్తుంటారు.

కొందరు మాత్రం మధ్యాహ్నం కునుకు తీయడం ఆరోగ్యానికి మంచిది కాదు అని భావించి ఎంత నిద్ర వచ్చినా సరే ఆపుకుంటారు.అసలు మధ్యాహ్నం కునుకు మంచిదా? చెడ్డదా? అంటే ఆరోగ్య నిపుణులు మంచిదనే చెబుతున్నారు.ఎలాంటి భయం లేకుండా మధ్యాహ్నం కునుకు తీయవచ్చు అని అంటున్నారు.

చంటి పిల్లలు ఉన్న తల్లులు తప్పకుండా మధ్యాహ్నం నిద్రించాల‌ని చెబుతున్నారు.ఎందుకంటే పిల్లల వల్ల రాత్రుళ్లు వారికి సరైన నిద్ర ఉండదు.

దాని వల్ల ఒత్తిడి పెరుగుతుంది.నీరసం అలసట వంటివి విపరీతంగా వేధిస్తుంటాయి.

Advertisement

అందువల్ల మధ్యాహ్నం కాస్త కునుకు మైండ్ రిఫ్రెష్( Mind Refresh ) అవుతుంది.నీరసం, అలసట, ఒత్తిడి, వంటివి దూరం అవుతాయి.

యాక్టివ్ గా మారతారు.

అలాగే శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల థైరాయిడ్‌, మధుమేహం, స్థూలకాయం, పీసీఓఎస్‌ వంటి దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతుంటాయి.ఇలాంటి వారు మధ్యాహ్నం భోజ‌నం త‌ర్వాత‌ కాసేపు కునుకు తీయడం వల్ల హార్మోన్లు సమతుల్యం( Harmones Balance ) అవుతాయి.దీంతో ఆయా సమస్యలు అదుపులో ఉంటాయి.

నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు మధ్యాహ్నం కునుకు తీస్తే ఎంతో మంచిది.తద్వారా నిద్రలేమి వల్ల‌ ఎదురయ్యే పలు సమస్యలను అడ్డుకోవచ్చు.

విష్ణువు వరాహవతారం ఎత్తడానికి గల కారణం ఇదే..!

అంతేకాదు మధ్యాహ్నం కునుకు తీస్తే జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.గుండె ఆరోగ్యంగా మారుతుంది.

Advertisement

పనిపై ఏకాగ్రత పెరుగుతుంది.త‌ల‌నొప్పి ఉంటే దూరం అవుతుంది.

అయితే మంచిది అన్నారు కదా అని మధ్యాహ్నం భోజనం తర్వాత గంటలు గంటలు నిద్రపోతే మొదటికే మోసం వస్తుంది.కేవలం ముప్పై నుంచి న‌ల‌భై నిమిషాలు మాత్రమే నిద్రించాలి.

అదే ఆరోగ్యానికి మంచిది.

తాజా వార్తలు