TDP Atchannaidu : ఓటర్ల జాబితాలో అక్రమాలు టీడీపీ నేత అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు( AP Elections ) జరగనున్నాయి.ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని తెలుగుదేశం గట్టి పట్టుదల మీద ఉంది.

దీంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు( TDP Chandrababu Naidu ) ఎన్నడూ లేని విధంగా కష్టపడుతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా "రా కదలిరా" సభలు నిర్వహిస్తున్నారు.

ఈ సభలలో వైసీపీ ప్రభుత్వం పై మండిపడుతున్నారు.అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు చేసే మంచి పనులు ఆమీల రూపంలో ప్రకటిస్తున్నారు.2024 ఎన్నికలను చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జాగ్రత్త వహించి జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది.

Irregularities In Voter List Tdp Leader Atchannaidu Sensational Comments

ఇదిలా ఉంటే తాజాగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు( TDP Atchannaidu ) సంచలన వ్యాఖ్యలు చేశారు.ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని వాలంటీర్ల( AP Volunteers ) ద్వారా టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించినట్లు ఆరోపించారు.అంతేకాదు సీఈవో కార్యాలయంలో డేటా చోరీ జరిగిందని అన్నారు.

Advertisement
Irregularities In Voter List Tdp Leader Atchannaidu Sensational Comments-TDP At

దీంతో ఓట్ల తొలగింపుపై అధికారులకు ఫిర్యాదులు చేస్తున్న పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది.సీఎం జగన్ ఎమ్మెల్యే బదిలీలు చేపడితే.

ఎమ్మెల్యేలు ఓటర్ల బదిలీలు చేస్తున్నారు. జనగణన పేరు( Janaganamana )తో వాలంటీర్లు వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారు అని అచ్చెన్నాయుడు విమర్శించడం జరిగింది.

గతంలోనే ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి జనసేన మరియు పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేయడం జరిగింది.తాజాగా మరోసారి అవే ఆరోపణలు అచ్చెన్నాయుడు చేయటం సంచలనంగా మారింది.

రాజమౌళి 2027 లో మహేష్ బాబు సినిమాను రిలీజ్ చేస్తాడా..?
Advertisement

తాజా వార్తలు