మరోసారి మొరాయించిన ఐఆర్సిటిసి..

భారతదేశంలో చాలా మంది ప్రయాణం చేయాల్సిన వారు ఎన్నుకొనే రవాణా మార్గం రైలు మార్గం(Train route).

మనలో చాలామంది రైలు ప్రయాణం చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు.

అందుకొరకు అనేకమంది ట్రైన్ బుక్ చేసుకోవడానికి సందర్శించే వెబ్సైట్ ఐఆర్సిటిసి(IRCTC).ఈ వెబ్సైట్ ద్వారా తాత్కాల్, ఏసీ, నాన్ ఏసీ టికెట్లను(Tatkal, AC, and non-AC tickets) బుక్ చేసుకుంటూ ఉంటారు.

అయితే, నేడు ఉదయం IRCTC వెబ్‌సైట్ మళ్లీ డౌన్ అయ్యింది.మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, తత్కాల్ టికెట్ బుకింగ్స్ మయంలోనే సైట్ డౌన్ అవ్వడంతో అందరు ఇబ్బందులు ఎదురుకున్నారు.

ప్రస్తుతం IRCTC వెబ్‌సైట్‌లో నిర్వహణ పనులు జరుగుతున్నాయి అనే వార్త వినపడుతుంది.దాంతో తదుపరి 1 గంట పాటు టికెట్ బుకింగ్ అందుబాటులో ఉండదు.

Advertisement

ఈ నెలలో ఇలా సైట్ డౌన్ అవ్వడం మూడోసారి.డిసెంబర్ 9, 2024న కూడా సైట్ రెండు గంటలపాటు నిలిచిపోయింది.దీని కారణంగా టిక్కెట్లు బుక్ చేసుకోవడంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదురుకున్నారు.

అయితే ఈ విషయం గురించి రైల్వేశాఖ నుండి ఎలాంటి అధికారిక సమాచారం ఇంకా రాలేదు, గతంలో కూడా ఇలాంటి పరిస్థుతుల్లో అధికారిక సమాధానాలు కూడా ఇవ్వలేదు.ఇలా సమస్యలు తలెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

కాబట్టి ఇప్పటికైనా రైల్వే శాఖ ఇటువంటి పరిస్థితులు మరోసారి ఎదురవ్వకుండా వెబ్సైట్ కెపాసిటీ పెంచితే బాగుంటుందని సదరు ప్రయాణికులు కామెంట్ చేస్తున్నారు.

రూ.1.50 కోసం 7 ఏళ్ల పోరాటం.. గ్యాస్ ఏజెన్సీకి దిమ్మతిరిగే షాక్!
Advertisement

తాజా వార్తలు