ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణ

టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.

ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసులో చంద్రబాబు తరపు లాయర్లు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ కేసులో చంద్రబాబును ఇవాళ్టి వరకు అరెస్ట్ చేయొద్దని, గతంలో ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.విజయవాడలోని ఏసీబీ కోర్టులో విచారణ దశలో ఉన్న పీటీ వారెంట్ ఈరోజు వరకు స్టే ఇచ్చింది.

ఈ క్రమంలో ఉత్తర్వులు ముగియనుండటంతో ఇవాళ మరోసారి ముందస్తు బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు ఏ1 గా పేర్కొన్న సంగతి తెలిసిందే.

My Empire : Reseña Y Reputación Del Sitio Para Jugadores E...
Advertisement