Manju Warrior : అందరి దృష్టి మంజు వారియర్ పైననే..కారణం ఏంటి ?

మంజు వారియర్( Manju Warrior ).

ఈ పేరు తెలుగు వారికి కాస్త పరిచయం తక్కువే కానీ లూసిఫర్ సినిమా( Lucifer movie ) పుణ్యమా అని మంజు ఇప్పుడు అన్ని సినిమా పరిశ్రమలకు పరిచయం అయిపోయింది.

లూసీఫర్ చిత్రంలో మోహన్ లాల్ ( Mohan Lal )కి చెల్లలి పాత్రలో అద్భుతంగా నటించింది మంజు వారియర్ ఈ చిత్రం తర్వాత ఆమెను అనేక భాషల్లో నటించమని మేకర్స్ కోరుతూ ఉండడం విశేషం.మంజు గురించి సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చే జరిగింది.

ప్రస్తుతం మంచు వారియార్ నటిస్తున్న సినిమాలు ఏంటి? ఏ ఏ భాషల్లో ఆమె సినిమాలు చేస్తుంది అనే విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మంజు మొదటి నుంచి మలయాళ సినిమాల్లోనే ఎక్కువగా నటించింది.ఇప్పుడు కూడా ఆమె చేతినిండా బోలెడన్ని మలయాళ సినిమాలు ఉన్నాయి.కానీ ప్రస్తుతం ఆమె తన సినిమాల డేట్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేస్తున్నారు.

Advertisement

ఎందుకంటే ప్రస్తుతం ఆర్య, గౌతమ్ కార్తీక్( Arya, Gautham Karthik ) నామినేషన్ లో వస్తున్న మిస్టరీ ఎక్స్ అనే సినిమాలో ఆమె ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేయబోతున్నారట.ఈ చిత్రంలో మంజు నటిస్తున్నట్టు ఆమె అఫీషియల్ గా ప్రకటించింది.

ఇక ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికే మను ఆనంద్ విష్ణు విశాల్ తో ఎఫ్ఐఆర్ అనే సినిమాను కూడా తీశారు.

అంతేకాదు ప్రస్తుతం ఆమెని తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా నటింప చేయాలని కొంతమంది భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఎందుకంటే ఒక స్ట్రాంగ్ ఉమెన్ అనే పాత్ర పోషించడానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరైన పాత్రధారులు లేదనేది బలమైన వాదన.అంతేకాదు ఇటీవల కాలంలో తమిళ్ నుంచి వచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్ అలాంటి పాత్రలు చేస్తున్నప్పటికీ ఆమె తప్ప మరొక ఆప్షన్ లేకపోవడంతో మంజు లాంటి ఒక నటి ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారట.

ఇక మంజు వ్యక్త గత విషయాలకు వస్తే మలయాళ హీరో దిలీప్ కుమార్ ని పేమించి పెళ్లి చేసుకొని ఒక బిడ్డ పుట్టిన తర్వాత విడిపోయింది మంజు.మొన్న ఆ మధ్య కాలంలో నటి భావన పై కారులో దాడి చేయించిన దిలీప్ జైలుకు వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo
Advertisement

తాజా వార్తలు