ఆ దేవాలయంలో హనుమంతుడే డాక్టర్.. అక్కడికి వెళ్తే క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన జబ్బు కూడా తగ్గుతుందట..!

మన దేశంలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి.కొంతమంది తాంత్రిక విద్యలతో బాధపడుతుంటే, మరికొంత మంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు.

ఇక మరికొంతమంది క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధి వచ్చి పూర్తి జీవితాన్ని కోల్పోతూ ఉన్నారు.అయితే ఎన్ని మందులు వాడినా ఎన్ని ఆసుపత్రులు తిరిగినా క్యాన్సర్ నుండి ఉపశమనం గానీ, పూర్తిగా తగ్గడం గానీ జరగదు.

కానీ మధ్యప్రదేశ్ లో( Madhya Pradesh ) ఓ గుడికి వెళ్తే చాలు ఎలాంటి రోగాలైనా మటుమాయం అవుతాయి.ఆ గుడిని హనుమాన్ క్లినిక్( Hanuman Clinic ) అని పిలుస్తారు.

ఎందుకంటే అక్కడ సాక్షాత్తు ఆంజనేయస్వామి వైద్యం చేస్తాడని చెబుతారు.ఆంజనేయ స్వామి వైద్యం చేయడం ఏంటి అని అనుకుంటూ ఉన్నారా? అయితే స్వామి వైద్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Interesting Facts About Dandraua Dham Hanuman Clinic In Madhya Pradesh Details,
Advertisement
Interesting Facts About Dandraua Dham Hanuman Clinic In Madhya Pradesh Details,

హిందువులలో చాలామంది ఆంజనేయ స్వామిని ఎంతో భక్తితో పూజిస్తారు.ఎందుకంటే ఆంజనేయ స్వామి కోరిన కోరికలు అన్ని తీరుస్తాడు.ప్రతి ఊరిలో దాదాపు హనుమంతుని ఆలయం( Hanuman Temple ) కచ్చితంగా ఉంటుంది.

ఇక వేరే ఆలయం ఉన్నప్పటికీ కూడా అందులో హనుమంతుడి విగ్రహం కూడా తప్పకుండా ఉంటుంది.రామభక్తలు హనుమంతుని పూజించడం వలన కోరిన కోరికలు అన్నీ కూడా తీరుతాయని నమ్ముతారు.

అయితే మధ్యప్రదేశ్ లో భిండ్‌లో దండ్రువా ధామ్( Dandraua Dham ) పేరుతో ఒక హనుమాన్ ఆలయము ఉంది.నిత్యం ఎంతో మంది ప్రజలు ఈ ఆలయానికి వస్తారు.

ఎందుకంటే ఇక్కడ ఆంజనేయస్వామిని డాక్టర్ బజరంగ్ బలిగా పూజిస్తారు.హనుమాన్ ఆలయాన్ని ఆసుపత్రిగా భావిస్తారు.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
ఉత్తరాంధ్ర భద్రాద్రి రామతీర్థం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

హనుమంతుడిని డాక్టర్ గా కొలుస్తారు.

Interesting Facts About Dandraua Dham Hanuman Clinic In Madhya Pradesh Details,
Advertisement

అయితే స్వామివారిని దర్శించుకుని ఆయన పాదాల దగ్గర ఉన్న నీరు తాగితే క్యాన్సర్ ( Cancer ) లాంటి రోగాలు కూడా తగ్గుతాయని నమ్ముతారు.ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఒక్కసారి అయినా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలని అనుకుంటారు.అయితే క్యాన్సర్ లాంటి మహమ్మారి తగ్గుతుందని ఇక్కడికి చాలామంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు వచ్చి వెళుతూ ఉంటారు.

హనుమంతుడి పాదాల దగ్గర నీళ్లు కూడా తీసుకొని వెళ్తారు.ఈ నీటిని తాగడం వలన క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా నయమవుతాయని అందరూ నమ్ముతారు.

అలాగే రోగులకు స్వయంగా హనుమంతుడే వైద్యం చేశాడని భక్తులు నమ్ముతారు.అలాగే అన్ని రకాల రోగాలకు హనుమంతుడు చికిత్స చేస్తాడని, అందుకే ఈ ఆలయాన్ని డాక్టర్ హనుమాన్ క్లినిక్ గా పిలుస్తారు.

అయితే వరుసగా 5 మంగళవారలు డాక్టర్ హనుమాన్ దగ్గర ధ్యానం చేసి అక్కడ ఇచ్చే నీళ్లు తాగితే క్యాన్సర్ తగ్గుతుందని అక్కడి భక్తులు చెబుతున్నారు.

తాజా వార్తలు