బిగ్ బాస్ లాంటి షోలు మనకు సెట్ అవ్వువు... క్లారిటీ ఇచ్చిన ఇంద్రనీల్!

బుల్లితెరపై ప్రసారం కాబోతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమం గురించి అందరికీ తెలిసిందే.

ఈ కార్యక్రమం ప్రస్తుతం తెలుగులో ఏడవ సీజన్ పూర్తి అయ్యి ఎనిమిదవ సీజన్ మరొక రెండు రోజులలో ప్రసారం కాబోతోంది.

సెప్టెంబర్ ఒకటవ తేదీ ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లకు సంబంధించిన లిస్ట్ కూడా వైరల్ అవుతుంది.

ఇక ఈ కార్యక్రమంలోకి మొదటి నుంచి కూడా మొగలిరేకులు సీరియల్ ఫేమ్ ఇంద్రనీల్ వర్మ ( Indra Neel Varma ) వెళ్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.అయితే తాజాగా ఈ వార్తలపై ఇంద్ర నీల్ స్పందిస్తూ అసలు విషయం వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన ఒక వీడియోను విడుదల చేస్తూ తాను బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లడం లేదని షాక్ ఇచ్చారు.

తాను బిగ్ బాస్ వెళుతున్నాను అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.అయితే బిగ్ బాస్ నిర్వాహకులు తనకు కాల్ చేసిన మాట వాస్తవమేనని తెలిపారు.

Advertisement

ఇలా ఫోన్ చేయగానే తాను ఇంట్రెస్ట్ లేదని చెప్పాను.కానీ ఒకసారి ఇంటర్వ్యూకి రమ్మంటూ కాల్ చేశారు సరే అని ఇంటర్వ్యూకి వెళ్ళాను ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సెకండ్ ఇంటర్వ్యూ కి రమ్మని చెప్పారు.అక్కడికి కూడా వెళ్లాను.

సెకండ్ టైం ముంబై కి చెందిన వాళ్లు తనని ఇంటర్వ్యూ చేశారని అయితే ఈ ఇంటర్వ్యూకి వెళ్లిన తర్వాత తనకు కూడా ఈ కార్యక్రమానికి వెళ్లాలని అనిపించింది.కానీ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే పరిస్థితులను ఊహించుకుంటే మనకు ఇలాంటి షోలు సెట్ అవ్వని నా నిర్ణయం మార్చుకున్నానని తెలిపారు.

ప్రస్తుతం మనకంటూ ఒక ఇమేజ్ ఉంది బిగ్ బాస్ వెళ్లిన తర్వాత ఆ ఇమేజ్ ఎలా అవుతుందో తెలియదు అలాంటప్పుడు వెళ్లకపోవడమే మంచిదని నిర్ణయం తీసుకున్నాము అంటూ ఈ సందర్భంగా ఇంద్రనీల్ క్లారిటీ ఇవ్వడంతో ఆయన అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు