యూకేలో స్వలింగ సంపర్కులుగా భారతీయులు యాక్టింగ్.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు...

భారత అక్రమ వలసదారులకు ఇంగ్లాండ్‌లో( England ) ఎలాగోలా ఆశ్రయం కల్పించడానికి బ్రిటీష్ లాయర్లలో కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నట్లు బట్టబయలైన విషయం తెలిసిందే.

వీరంతా ఒక మాఫియాలా ఏర్పడి బాధితుల నుండి నగదు వసూలు చేసి బదులుగా ఖలిస్తానీలుగానూ ఉండాలని చెబుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి విధితమే.తాజాగా వీరి గురించి మరొక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.అది ఏంటంటే ఈ లాయర్లు స్వలింగ సంపర్కులగానూ చెప్పి భారత్‌లో తమ ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు కోర్టుకు చెప్పమని భారతీయ అక్రమ వలసదారులకు చెబుతున్నారట.

ఓ ప్రముఖ మీడియా సంస్థ ఈ విషయాన్ని ఎక్సక్లూసివ్ గా వెల్లడించింది.ఓ స్టింగ్ ఆపరేషన్ ఆధారంగా ఈ విషయాన్ని తెలుసుకున్న బ్రిటన్ ప్రధాని ఋషి సునాక్( British Prime Minister Rishi Sunak ) తీవ్రస్థాయిలో స్పందించారు.

వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇకపోతే, భారత్ నుంచి ఇంగ్లాండ్ వలసవచ్చే వారిలో ఎవరైనా సరైన డాక్యుమెంట్లు లేకుండా ఉంటే వారిని అక్కడ లాయర్లలో కొందరు టార్గెట్ చేస్తారు.వీరికి ఇంగ్లాండ్‌లో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే మతాంతర వివాహం చేసుకున్నామని, లేదంటే స్వలింగ సంపర్కులమని, అలాగే ఖలిస్తానీ మద్దతుదారులమని కోర్టుకి చెబితే వారికి ఎలాగైనా అక్కడ ఎంట్రీ లభిస్తుందని నమ్మబలికి దీనికోసం 5500 యూరో పౌండ్లను వారినుండి వసూలు చేస్తున్నారని వెల్లడైంది.ఒక రిపోర్టర్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో లాయర్ చెబుతుండగా వీడియో తీయడం జరిగింది.

ఇక ఈ వీడియో ప్రధాని రిషి సునాక్ కు చేరడంతో ఆయన ఈ వ్యవహారంపై చాలా సీరియస్ అయ్యారు.

దాంతో అయన ట్విట్టర్ వేదికగా చాలా తీవ్రంగా ధ్వజమెత్తారు.ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని.చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

ఇకపోతే ప్రతిపక్ష లేబర్ పార్టీవారు, కొంతమంది లాయర్లు, క్రిమినల్ గ్యాంగులు వారి జేబులు నింపుకోవడం కోసం ఇలా అక్రమ వలసదారులకు చట్టవ్యతిరేక మార్గంలో సహాయపడుతున్నట్టు తెలుసుకున్నారు ఋషి సునాక్.అదేవిధంగా దీన్ని ఎలా ఆపాలో నాకు తెలుసనీ, అలాంటి చర్యలు చేసేవారి ఆటలు ఇక సాగవని నొక్కి వక్కాణించి మరీ చెప్పారు.

ఇకపోతే ఇది కేవలం ఆ దేశానికే పరిమితం కాలేదు.వివిధ ఫారిన్ కంట్రీలలో ఇలాంటి చర్యలు జరుగుతున్నట్టు కూడా కొంతమంది గూఢచారుల ద్వారా తెలుసుకుంటున్నాయి ఆయా ప్రభుత్వాలు.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

తాజా వార్తలు