ఎన్నారై వర్కర్‌కు ఊహించని శిక్ష విధించిన సింగపూర్ కోర్టు...

సింగపూర్‌( Singapore )లోని ఓ షిప్‌యార్డ్‌లో పనిచేస్తున్న ఓ భారతీయ వ్యక్తి ఇతర కంపెనీల ఉద్యోగులను మోసం చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు.

సదరు వ్యక్తి ఇతర కంపెనీల్లోని వారికి ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తానని లంచం( Corruption ) తీసుకుంటూ పట్టుబడ్డాడు.

అతని పేరు రాజవిక్రమన్ జయపాండియన్, అతని వయస్సు 49 సంవత్సరాలు.అయితే పోలీసులు అతడిని అరెస్టు చేశాక తాను 13 సార్లు చట్టాన్ని ఉల్లంఘించినట్లు అంగీకరించాడు.

కోర్టు 33 సార్లు అదే పని అతడు చేశాడని అభియోగాలు మోపింది.అతను లంచాల నుంచి దాదాపు 1,91,116 సింగపూర్ డాలర్లు సంపాదించాడు.

రాజవిక్రమన్‌కు బుధవారం మూడు సంవత్సరాల ఏడు నెలల జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది.

Advertisement

లంచాల రూపంలో సంపాదించిన డబ్బు మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించింది.అలా చేయకుంటే మరో ఆరు నెలలు జైల్లో ఉండాల్సి వస్తుందని తెలిపింది.రాజవిక్రమన్ కెప్పెల్ ఫెల్స్ షిప్‌యార్డ్‌( Keppel Shipyard )లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసేవాడు.

అతని కింద ఎనిమిది మంది మేనేజర్లు, 100 మంది వర్కర్లతో కూడిన పెద్ద బృందం ఉంది.అయితే ఇతను షిప్‌యార్డ్‌ను వదిలి రొటేటింగ్ ఆఫ్‌షోర్ సొల్యూషన్స్ అనే మరో కంపెనీలో చేరాడు.

ఈ సంస్థ గాలిని ఉత్పత్తి చేసే, కుదించే యంత్రాలను తయారు చేస్తుంది, డిజైన్ చేస్తుంది.

కానీ జయపాండియన్ తన చెడు అలవాట్లను మానుకోలేదు.లంచాలు పొందడానికి షిప్‌యార్డ్‌లోని తన పాత స్నేహితుడితో కలిసి పనిచేశాడు.అతడి స్నేహితుడి పేరు ఆల్విన్ లిమ్ వీ లూన్, వయస్సు 44 సంవత్సరాలు.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

వీరిద్దరూ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు( Jobs in Shipyard ) ఇప్పిస్తామంటూ ఇతర కంపెనీల నుంచి డబ్బులు అడిగి మోసం చేశారు.వారు చాలా నిజాయితీ లేనివారు, అత్యాశపరులు అని నివేదిక పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు