'ఇండియన్ 2' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫైనల్ గా రాబోతుంది ఎప్పుడంటే?

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్( Kamal Haasan ) ఎన్నో ఏళ్ల తర్వాత ఫామ్ లోకి రావడంతో అదే ఊపులో వరుస సినిమాలు చేస్తూ ఆయన ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తున్నాడు.

గత కొన్నేళ్లుగా హిట్ ముఖమే చూడని కమల్ కు ఎన్నో ఏళ్ల తర్వాత విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ లభించింది.

దీంతో ఈయన ఎప్పుడో ఆగిపోయిన ఇండియన్ 2( Indian 2 ) సినిమాను మళ్ళీ సెట్స్ మీదకు తీసుకు వచ్చాడు.

రెండేళ్ల క్రితం ఎంతో గ్రాండ్ గా స్టార్ట్ అయిన ఈ మూవీ అనేక కారణాల వల్ల వాయిదా పడింది.

ఈ సినిమా ఇక తెరకెక్కే అవకాశమే లేదు అని ప్రేక్షకులు భావిస్తున్న నేపథ్యంలో మళ్ళీ సెట్స్ మీదకు తీసుకు వచ్చి సినిమా ఆగిపోలేదు అని చెప్పకనే చెప్పారు.భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది.

Advertisement

శంకర్( Director Shankar ), కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కిన భారతీయుడు ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అందుకే ఈ సినిమా సీక్వెల్ కోసం అంతే ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

కానీ శంకర్ మాత్రం ఫ్యాన్స్ కు ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా నిరాశ పరుస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ గురించి పలు వార్తలు వైరల్ కాగా ఫైనల్ గా రిలీజ్ గురించి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

ఈ సినిమాను వచ్చే ఏడాది ఇండిపెండెన్స్ డే కానుకగా థియేటర్స్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందని మేకర్స్ ఇదే టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్నారు అని కోలీవుడ్ మీడియా( Kollywood Media )లో స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది.చూడాలి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో.ఇక ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ ఫిలిమ్స్ సంయుక్తంగా వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తుండగా.

అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 
Advertisement

తాజా వార్తలు