ఇక భారతీయులకు చౌకగా అంతర్జాతీయ విమానయానం.. 116 దేశాలతో కేంద్రం ఒప్పందం

కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన రంగాల్లో ఏవియేషన్ ఇండస్ట్రీ కూడా ఒకటి.

వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు గాను ప్రపంచ దేశాలన్నీ నెలల తరబడి అంతర్జాతీయ , దేశీయ విమాన సర్వీసులను నిలిపివేశాయి.

అత్యవసరమైతే తప్పించి రన్ వే మీద విమానాలు కనిపించేవి కాదు.భారీ ఎత్తున వ్యాక్సినేషన్ జరిగి ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి.

విమాన ప్రయాణీకులు కూడా ఎయిర్‌పోర్టులకు పోటెత్తుతున్నారు.అయితే విమాన ఛార్జీలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి.

దీనికి తోడు రూపాయి విలువ రోజురోజుకు పతనమవుతూ వుండటంతో భారతదేశంలోని మధ్య తరగతి వర్గాలు విమానాల వంక కన్నెత్తి కూడా చూడటం లేదు.ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై నష్ట నివారణా చర్యలు చేపట్టింది.

Advertisement

దీనిలో భాగంగా 116 దేశాలతో ద్వైపాక్షిక విమాన సేవా ఒప్పందాలను కుదుర్చుకుంది భారత ప్రభుత్వం.దేశంలోని మెట్రోపాలిటన్ నగరాలకు మరిన్ని సేవలను జోడించడంతో పాటు భారత్‌లో సేవలందించేందుకు మరిన్ని విదేశీ ఎయిర్‌లైన్స్‌కు అనుమతించేందుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది.

ఈ క్రమంలో భారతదేశం 116 విదేశాలతో ద్వైపాక్షిక ఎయిర్ సర్వీసెస్ ఒప్పందం (ఏఎస్ఏ)పై సంతకం చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ సోమవారం పార్లమెంట్‌కు లిఖితపూర్వకంగా తెలియజేశారు.భారత్‌తో ద్వైపాక్షిక ఎయిర్ సర్వీసెస్ ఒప్పందాలపై సంతకం చేసిన దేశాలలో ఆసియా, యూరప్, మిడిల్ ఈస్ట్, దక్షిణ అమెరికా దేశాలున్నట్లు ఆయన చెప్పారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ప్రయాణీకులకు మేలు చేస్తుందని.విమాన ఛార్జీలు తగ్గే అవకాశం వుందని ట్రావెల్ పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.సీట్ కెపాసిటీని పెంచడానికి దేశాలతో ద్వైపాక్షిక ఎయిర్ సర్వీస్ ఒప్పందాలు చేసుకోవడం, విదేశీ క్యారియర్‌ల కోసం ఓపెన్ స్కై పాలసీని కలిగి వుండటం మంచిదని ఎస్‌టీఐసీ ట్రావెల్ గ్రూప్ బిజినెస్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ అంజూ వారియా ఓ జాతీయ మీడియా సంస్థతో అన్నారు.

ప్రస్తుతం విదేశీ క్యారియర్‌లకు అనుకూలమైన కాల్ పాయింట్ల సంఖ్యలో గణనీయమైన అసమతుల్యత కారణంగా, ప్రయాణికులను నడపడానికి ఏ విదేశీ క్యారియర్‌కూ కొత్త కాల్ పాయింట్‌గా మెట్రోయేతర విమానాశ్రయాన్ని మంజూరు చేయడం లేదని ప్రభుత్వం తెలిపింది.మెట్రో విమానాశ్రయాలు కాకుండా ఇతర నగరాల నుండి విదేశీ క్యారియర్‌లను ఆపరేట్ చేయడానికి అనుమతించాలని ట్రావెల్ పరిశ్రమ కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతోంది.

రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు : రాష్ట్ర మంత్రులు
Advertisement

తాజా వార్తలు