నిజ్జర్ హత్య కేసు .. జస్టిన్ ట్రూడోకు షాకిచ్చిన కెనడియన్ ఏజెన్సీ నివేదిక

ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ ( Hardeep Singh Nijjar )హత్య కేసు భారత్ - కెనడాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే.

ఈ హత్య వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

వీటిపై న్యూఢిల్లీ సైతం తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యింది.తర్వాత నిజ్జర్ హత్య కేసులో ఏకంగా కెనడాలో భారత హైకమీషనర్ సంజయ్ కుమార్ వర్మ( Indian High Commissioner Sanjay Kumar Verma ) పేరును చేర్చడంతో కేంద్రం భగ్గుమంది.

అనంతరకాలంలో నిజ్జర్ హత్య కేసుపై తాను భారత్‌పై చేసిన వ్యాఖ్యలకు సరైన ఆధారాలు లేవని ట్రూడో చేతులెత్తేశారు.తాజాగా నిజ్జర్ హత్య కేసులో మరో దేశం హస్తం లేదని ఓ కెనడియన్ కమీషన్ పేర్కొంది.

ఫెడరల్ ఎన్నికల ప్రక్రియలు, ప్రజాస్వామ్య సంస్థలలో విదేశీ జోక్యానికి సంబంధించిన ప్రజా విచారణ అనే పేరుతో మంగళవారం ఓ నివేదిక విడుదలైంది.నిజ్జర్ హత్యపై భారతదేశం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిందని నివేదిక వ్యాఖ్యానించింది.123 పేజీల ఈ నివేదికలో ఆరుగురు భారత దౌత్యవేత్తల బహిష్కరణ అంశం గురించి కూడా ప్రస్తావించారు.దీనికి ప్రతిగా భారత్ కూడా ఆరుగురు కెనడియన్ దౌత్యవేత్తలను బహిష్కరించడంతో పాటు తన హైకమీషనర్‌ను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది.

Advertisement

మరోవైపు. కెనడా ఎన్నికలలో( Canadian elections ) కొన్ని విదేశీ ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటున్నాయనే ఆరోపణలను పరిశోధించిన కెనడియన్ కమీషన్ నివేదికలో తనపై చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది.నిజానికి తమ అంతర్గత వ్యవహారాల్లో కెనడా నిరంతరం జోక్యం చేసుకుంటోందని మండిపడింది.

కాగా.2023 జూన్ 18న బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో హర్దీప్ సింగ్ నిజ్జర్‌‌ దారుణహత్యకు గురయ్యాడు.గురునానక్ సింగ్ గురుద్వారా సాహిబ్ పార్కింగ్ ప్లేస్‌లో అతనిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.

నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి కరణ్ బ్రార్ (22), కమల్ ప్రీత్ సింగ్ (22), కరణ్ ప్రీత్ సింగ్ (28), అమన్‌దీప్ సింగ్ (22)లను గతేడాది మేలో కెనడా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు