కుప్పంలో పెరిగిన పొలిటికల్ హీట్

చిత్తూరు జిల్లా కుప్పంలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది.తాజాగా కుప్పంలో వేలాదిగా బోగస్ ఓట్టు ఉన్నాయంటూ వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది.

కుప్పంలోనే సుమారు 36 వేల బోగస్ ఓట్లు ఉన్నాయని ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు.ఈ బోగస్ ఓట్లు ఇతర రాష్ట్రాల వారివన్న మిథున్ రెడ్డి ఈ ఓట్ల కారణంగానే చంద్రబాబు గెలుస్తున్నారని విమర్శలు గుప్పించారు.

మరోవైపు వైసీపీ వ్యాఖ్యలకు టీడీపీ నేతలు ధీటుగానే బదులిస్తున్నారు.ఈ క్రమంలో మిథున్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించిన టీడీపీ నేతలు ఓగస్ ఓట్ల చరిత్ర మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానిది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అటు వైసీపీ, ఇటు టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధంతో రాజకీయ వేడి క్రమక్రమంగా పెరుగుతోంది.

Advertisement
Hair Fall : హెయిర్ ఫాల్ కి బెస్ట్ సొల్యూషన్.. ఒక్కసారి దీన్ని ట్రై చేశారంటే జుట్టు ఊడమన్నా ఊడదు!

తాజా వార్తలు