తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా

తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది.ఈ మేరకు త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని ప్రభుత్వం వెల్లడించింది.

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసింది రాష్ట్ర సర్కార్.షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వం నిర్మించిన డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయాన్ని ఈనెల 17వ తేదీన ప్రారంభించాల్సి ఉంది.ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడండో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.

దీంతో సచివాలయం ప్రారంభోత్సవంపై సీఎస్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించారు.ఈ క్రమంలో సీఈడీ ప్రతిస్పందన సానుకూలంగా లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.

Fatboss : Sécurité Des Joueurs Et Jeu Responsable
Advertisement