కరీంనగర్ లో ఎలుగుబంటి హల్ చల్

ఇటీవల కాలంలో ఎక్కడా చూసిన అటవీ జంతువులు జనావాసాల్లోకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయి.

తాజాగా ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లాలో జనావాసాల్లోకి వచ్చిన ఓ ఎలుగుబంటి హల్ చల్ చేసింది.

శాతవాహన యూనివర్సిటీలో ఎలుగు సంచారం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.యూనివర్సిటీ గుట్టల్లో ఆవాసం ఏర్పాటు చేసుకున్న ఏలుగు అర్ధరాత్రి సమయాల్లో తిరుగుతున్నట్లు గుర్తించారు.

దీంతో వర్సిటీకి చెందిన విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు ఎలుగు అడుగు జాడలను గుర్తించే పనిలో పడ్డారు.

Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players
Advertisement