వీరమల్లు లేటెస్ట్ అప్డేట్ ఇదే.. పవన్ అలా నిర్ణయించుకున్నాడా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ లో వకీల్ సాబ్ తో స్టార్ట్ చేసి ఆ తర్వాత కూడా వరుస సినిమాలను లైన్లో పెట్టడంతో ఫ్యాన్స్ అంతా ఖుషీ గా ఉన్నారు.

సెకండ్ ఇన్నింగ్స్ లో అయినా ఫాస్ట్ గా చేస్తాడు అని సంబర పడ్డారు.కానీ వీరి ఆనందానికి పవన్ కళ్యాణ్ బ్రేక్ వేసాడు.వకీల్ సాబ్ తర్వాత వెంటనే భీమ్లా నాయక్ తో వచ్చి మరో హిట్ కొట్టాడు.

కానీ ఈ సినిమా వచ్చి కొన్ని నెలలు అవుతున్న మరో సినిమా పూర్తి చేయలేక పోయాడు.ప్రెజెంట్ పవన్ చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్న కూడా ఈయన సెట్ లోకి అడుగు పెట్టక చాలా రోజులే అవుతుంది.

ఇక పవన్ చేస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు ఒకటి.ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఈ సినిమా ఎప్పటి నుండో షూటింగ్ జరుపు కుంటుంది.

కానీ ఏదో ఒక అడ్డంకి అయితే ఎదురవుతూనే ఉంది.దీంతో ఎప్పుడు ఈ షూటింగ్ వాయిదా పడుతూనే వస్తుంది.

పవన్ రాజకీయాల కోసం అని ఎప్పటికప్పుడు ఈ షూటింగ్ ఆగిపోవడంతో ఇంకా ముగింపు దశకు చేరుకోలేక పోతుంది.అయితే ఎన్నో రోజుల తర్వాత ఈ సినిమా కోసం పవన్ మళ్ళీ రెడీ అయ్యాడు అని అంతా అనుకున్నారు.

కానీ మళ్ళీ ఈయన పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడం అందరిలో ఆసక్తి కలిగేలా చేస్తుంది.దీంతో సినిమా షూటింగులలో ఎప్పుడు పాల్గొంటాడో అర్ధం కావడం లేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ ఏపీ నుండి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత సెట్స్ లోకి వెళతాడట.ముందుగా హరిహర వీరమల్లును పూర్తి చేసి ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ చేయనున్నాడని తెలుస్తుంది.అక్టోబర్ లాస్ట్ వీక్ నుండి పవన్ సెట్స్ లో అడుగు పెట్టే అవకాశం ఉంది అని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.మెగా సూర్య ప్రొడక్షన్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

మొదటిసారిగా పవన్ పీరియాడిక్ యాక్షన్ సినిమాలో నటిస్తుండడం అలాగే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం వల్ల ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు