ముక్కోటి ఏకాదశి సందర్బంగా చేయాల్సిన పూజలు.. ఈ పూజలు ఇంట్లో ఐశ్వర్యం, ఆనందంను తీసుకు వస్తాయి

ప్రతి సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి.అయితే వాటిలో ముక్కోటి ఏకాదశి చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవాలి.

ముక్కోటి ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. మహావిష్ణువు పూజ చేయడంతో పాటు, ఆరోజున ఉత్తర ద్వారం ద్వారా విష్ణువును దర్శించుకుంటే అంతకు మించిన అదృష్టం ఉండదని పెద్దలు అంటారు.

ఏకాదశి రోజునే మహావిష్ణువు ఒక శక్తిగా అవతరించి మురాసురుడు అనే రాక్షసుడిని అంతమొందించి భూ మండలంను కాపాడటం జరిగింది.ఆ శక్తి ఆవిష్కరించిన రోజు అవ్వడంతో పాటు, ఆ రోజున దేవతలందరితో కలిసి భూమి మీదకు విష్ణువు వస్తాడు.

అలా వచ్చిన కారణంగానే ముక్కోటి ఏకాదశి అంటారంటూ కొందరు అంటూ ఉంటారు.ప్రతి ముక్కోటి ఏకాదశిన విష్ణువు దేవతలందరితో కూడా భూమి మీదకు వస్తారని, భక్తులు చేసే పూజలను స్వీకరిస్తారని అంతా నమ్ముతూ ఉంటారు.

Advertisement

ప్రతి ఏకాదశి కూడా చాలా విషిష్టమైనదే అయినప్పటికి ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున దేవాలయంకు వెళ్లి పూజలు చేస్తారు.ముక్కోటి ఏకాదశి రోజున చన్నీటి స్థానం చేసి, తెల్లవారు జామునే ఉత్తర ద్వారంగా మహావిష్ణువును దర్శించుకుంటే సకల పాపములు పోతాయి.

దాంతో పాటు ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే సమస్య దోషాలు తొలగి పోయి, ఐశ్వర్యం కలిసి వస్తుందట.మహావిష్ణువు శయన రూపంలో ఉండే దివ్య రూపంను చూడటం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుంది.

ఎలాంటి గ్రహదోశాలు ఉన్న వారు అయినా కూడా ముక్కోటి ఏకాదశి రోజున మహావిష్ణు దర్శనం చేసుకుని స్వామి వారి కోసం ఉపవాస దీక్ష చేస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుందని పెద్దలు అంటున్నారు.తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి కారణంగా దేవాలయాలు కిక్కిరిసి పోతున్నాయి.

ట్రంప్ దెబ్బకి అమెరికాలో భారీగా పెరుగుతున్న సిజేరియన్లు.. భారతీయ తల్లులు పరుగులెందుకు?
Advertisement

తాజా వార్తలు