విశాఖ పెందుర్తి రోడ్ షోలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!!

విశాఖ పర్యటనలో భాగంగా పెందుర్తి రోడ్డు షోలో బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలందరిపై ఉందని వ్యాఖ్యానించారు.

గత ఎన్నికలలో 24 సీట్లు వచ్చినప్పటికీ అందులో 4 విశాఖలోనే ఉన్నాయని పేర్కొన్నారు.హుదూద్ వంటి ప్రకృతి వైపరీత్యం విశాఖను వెంటాడిన టీడీపీ( TDP ) ప్రభుత్వం ప్రజలకు అండగా ఉందని తెలియజేశారు.

హుదూద్ కీ ముందు తర్వాత.విశాఖ ప్రజలు చిరస్థాయిగా గుర్తించుకుంటారన్నారు.

ఇదే సమయంలో సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలు చేశారు.

Advertisement

సైకో జగన్( jagan ) కి పిచ్చి ముదిరిందని అదే ఇంటిని ఫ్రీజ్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.జగన్ టూర్లు పరదాల చాటున.నిర్బంధాల మధ్యన సాగుతున్నయని మండిపడ్డారు.

ఈ సైకో ముఖ్యమంత్రి పేదలకు టీడ్కో ఇల్లు ఇచ్చారా అని ప్రశ్నించారు.జగన్ వచ్చి మూడు రాజధానులు అనేసరికి రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు మండిపడ్డారు.

విశాఖ పై జగన్ కు ప్రేమ లేదని విశాఖ భూములు పైనే జగన్ పన్ను ఉందని ఆరోపించారు.జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే విశాఖలో పేదల భూములు మటాష్ అవుతాయని చంద్రబాబు పేర్కొన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 5, ఆదివారం, జ్యేష్ఠ మాసం , 2022
Advertisement

తాజా వార్తలు