ఏపీలో పెన్షన్ పంపిణీ పై చీఫ్ సెక్రటరీ కీలక ఆదేశాలు..!!

ఏపీలో కూటమి ప్రభుత్వం పెన్షన్ పంపిణీ( Distribution of pension ) విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది.

ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి వస్తే నాలుగు వేల పెన్షన్ మంజూరు చేస్తా అని చంద్రబాబు( Chandrababu ) ప్రకటించారు.

ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక పెన్షన్ పెంచడం జరిగింది.ఇదిలా ఉంటే పెన్షన్ల పంపిణీకి కేటాయించిన నగదును బ్యాంకుల నుంచి శనివారం రాత్రిలోగా విత్ డ్రా చేసుకోవాలని కలెక్టర్లను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఆదేశించారు.

ఇవాళ రాత్రికి ఇవ్వలేకుంటే ఆయా బ్యాంకులు ఆదివారం అందించాలని ఆయన స్పష్టం చేశారు.జులై మొదటి తారీఖున ఉదయం 6 గంటలకు పెన్షన్ల పంపిణీ ప్రారంభం కావాలని.ఆ రోజే 90 శాతం పంపిణీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

పెన్షన్ల పంపిణీపై కలెక్టర్లు నిత్యం సమీక్షించాలని చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ( Chief Secretary Nirab Kumar )పేర్కొనడం జరిగింది.కాగా గత వైసీపీ ప్రభుత్వం హయాంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం వాలంటీర్ల ద్వారా జరిగేది.

Advertisement

కాగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల చేత పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తుంది.ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పెంచిన 4వేల రూపాయల పెన్షన్ తో పాటు అదనంగా 3000 రూపాయలు మొత్తం 7000 రూపాయలు జులై మొదటి తారీఖున పెన్షన్ దారులకు నగదు అందనుంది.

Shocking Facts About Money Plant I Mana Health
Advertisement

తాజా వార్తలు